హైదరాబాద్ కు రెడ్ అలెర్ట్..
- August 16, 2024
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో కూడా ఎడతెరిపిలేకుండా వానలు పడుతున్నాయి. నగరవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురవడంతో లోతట్టు ప్రాంతాలు వరద ముంపులో చిక్కుకుపోయాయి. కాగా, రాత్రికి మరింత కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని తాజాగా హైదరాబాద్ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
నగరంలో భారీగా వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. ఏదైనా సహాయం కోసం 040 21111111కు ఫోన్ చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.
వర్షం కారణంగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. లక్డీకపూల్, ఖైరతాబాద్, అమీర్ పేట, ఖాజాగూడ జంక్షన్, మల్కంచెరువు, బయోడైవర్సిటీ కూడలి, ఐకియా జంక్షన్, గచ్చిబౌలి తదితర ప్రధాన రహదారులపై వాహనాలు బారులు తీరాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తాజా వార్తలు
- మెడికల్ విద్యార్థులకు శుభవార్త–ఏపీలో 250 కొత్త ఎంబీబీఎస్ సీట్లు
- కొత్త ODI జెర్సీ విడుదల
- ‘శ్వాస స్వర సంధ్య' తో ఈలపాట మాంత్రికుడు పద్మశ్రీ డా.శివప్రసాద్ మాయాజాలం
- దుబాయ్ లో నిర్లక్ష్యంగా డ్రైవింగ్..వాహనం సీజ్..!!
- ఇబ్రి గవర్నరేట్లో అగ్నిప్రమాదం..తప్పిన ప్రాణాపాయం..!!
- భవనాల సబ్ డివజన్ కి SR25వేల గరిష్ట జరిమానా..!!
- హైదరాబాద్ లో భారీగా గోల్డ్ బార్స్ స్వాధీనం..!!
- ప్రైవేట్ పాఠశాలలకు BD100,000 వరకు జరిమానాలు..!!
- ఖతార్ లో పుంజుకున్న రెసిడెన్షియల్ రెంటల్ మార్కెట్..!!
- తిరుమల లడ్డూ ధర పెంపు వార్తలు అవాస్తవం: బీఆర్ నాయుడు