ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు సమావేశం..
- August 17, 2024
న్యూ ఢిల్లీ: ప్రధానితో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత చంద్రబాబు తొలిసారి ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. అమరావతి పునర్ నిర్మాణం, పోలవరం కోసం నిధులు కేటాయించాలని చంద్రబాబు ప్రధానిని కోరారు. అలాగే వెనుకబడిన జిల్లాలకు నిధులతో పాటు కొత్త రుణాలపై ప్రధానితో చర్చించారు చంద్రబాబు.
వైసీపీ హయాంలో చేసిన రుణాలను రీషెడ్యూల్ చేయాలని మోదీ దృష్టికి తీసుకెళ్లారు చంద్రబాబు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి కేటాయించిన నిధులు విడుదల చేయాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీతో తర్వాత ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కానున్నారు.
తాజా వార్తలు
- మూడు దేశాల్లో సీఎం చంద్రబాబు పర్యటన
- నవంబర్ 26 లేదా 27 తేదీల్లో WPL 2026 వేలం..!
- దుబాయ్ లో చంద్రబాబుకు ఘన స్వాగతం!
- కువైట్, టర్కీ సంబంధాలు పునరుద్దరణ..!!
- మస్కట్ ఎయిర్ పోర్టులో హువావే క్యాంపస్ ప్రారంభం..!!
- అల్ రయాన్ రోడ్ పాక్షికంగా మూసివేత..!!
- మల్కియా బీచ్లో యువకుడిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈలో గోల్డ్ కాయిన్ లకు పెరిగిన డిమాండ్..!!
- సౌదీలో అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్టు..!!
- రాష్ట్రాభివృద్ధికి ఎన్ఆర్ఎలు సహకరించాలి: మంత్రి నారా లోకేష్