మహిళలు, యువవైద్యుల భద్రతపై సుప్రీంకోర్టు ఆందోళన
- August 20, 2024
న్యూఢిల్లీ: మహిళలు, యువవైద్యుల భద్రతపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వైద్యుల పనిప్రదేశంలో భద్రత కోసం ప్రణాళికను రూపొందించడానికి పది మంది సభ్యులతో టాస్క్‌ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ హత్య, అత్యాచారం కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించిన సంగతి తెలిసిందే.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసుపై మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పలు ప్రశ్నలు సంధించింది. బాధితురాలి పేరు, ఫోటోలు, వీడియోలు మీడియాలో వైరల్ కావడం పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నామని పేర్కొంది. ఈ కేసులో సరైన సమయంలో ఎఫ్‌ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించింది. పోస్ట్‌మార్టమ్‌లో వైద్యురాలు హత్యకు గురైనట్లు తేలినా.. రాత్రి 11.45 గంటల వరకు ఎఫ్‌ఐఆర్ ఎందుకు నమోదు చేశారని ప్రశ్నించింది. ఆస్పత్రిలో అధికారులు ఏం చేస్తున్నారు అని నిలదీసింది. ప్రిన్సిపల్ ఏం చేస్తున్నాడు.. ఆత్మహత్యగా ఎందుకు ప్రకటించారు. గురువారంలోగా దర్యాప్తు స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని సిబిఐకి ఆదేశించింది. కార్యాలయంలో మహిళల భద్రత గురించి ఎదురవుతున్న ఆందోళనలపై పౌరులు మాట్లాడాల్సిన అవసరం ఉందని అన్నారు.
తాజా వార్తలు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!