శ్రీలంక క్రీడారంగానికి మోదీ చేయూత
- June 17, 2016
భారత ప్రధాని నరేంద్ర మోదీ, శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనలు కలిసి శ్రీలంకలోని జాఫ్నా స్టేడియంను ప్రారంభించనున్నారు. ఈ స్టేడియంను భారత్ సహాయంతో పునర్నిర్మించారు. సిరిసేన స్టేడియం ప్రారంభోత్సవం చేసే సమయంలో నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొంటారని ప్రధాని మంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. మాజీ మేయర్ జాఫ్నా పేరుమీదుగా గతంలోని దురయప్ప స్టేడియంను జాఫ్నా స్టేడియంగా పేరు మార్చారు. ఈ స్టేడియం పునర్నిర్మాణానికి భారత ప్రభుత్వం రూ.7కోట్లు వెచ్చించింది. ఈ స్టేడియంలో 1850 మంది కూర్చోవచ్చు. క్రీడలను ప్రోత్సహించడం కోసం ఇందులో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించినట్లు ప్రకటనలో వెల్లడించారు. త్వరలో రెండో యోగా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా స్టేడియంలో యోగాపై కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో దాదాపు 8వేల మంది పాల్గొనే అవకాశముందని చెప్పారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









