ఎన్నారైలకు పింఛను ఆన్లయిన్లో లభ్యం

- June 17, 2016 , by Maagulf
ఎన్నారైలకు పింఛను ఆన్లయిన్లో లభ్యం

జాతీయ పింఛన్‌ పథకంలో చేరాలనుకుంటున్న ఎన్‌ఆర్‌ఐలకు మార్గం మరింత సుగమమైంది. ఇప్పటివరకు ఈ పథకాన్ని పొందాలంటే ఎన్‌ఆర్‌ఐలు స్వయంగా సంబంధిత బ్యాంకుకు విచ్చేసి దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. ఇక నుంచి ఆన్‌లైన్‌ ద్వారా కూడా ఈ పథకాన్ని పొందవచ్చని ఆర్థిక మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. 'ఇక నుంచి ఎన్‌ఆర్‌ఐలు ఈ-ఎన్‌పీఎస్‌(నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌) ద్వారా ఇంటి నుంచే పథకాన్ని పొందే అవకాశం ఉంది. ఇందుకోసం ఆధార్‌కార్డు లేదా పాన్‌కార్డు కలిగి ఉంటే సరిపోతుంది' అని ఉన్నతాధికారులు తెలిపారు. భారతీయ ఆర్థిక వ్యవస్థలో ప్రవాసులను కూడా భాగస్వాములను చేసే ఉద్దేశంతో ఈ సదుపాయాన్ని కల్పించినట్లు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com