భద్రత విషయంలో రాజీ పడేది లేదు: బహ్రెయిన్ ప్రధాని
- June 18, 2016
బహ్రెయిన్ ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా, భద్రత విషయంలో బహ్రెయిన్ ఎప్పుడూ రాజీ పడబోదని స్పష్టం చేశారు. జిసిసి దేశాల మధ్య ఐక్యతకు బహ్రెయిన్ కట్టుబడి ఉందనీ, దేశంలో ఎలాంటి తీవ్రవాద కార్యకలాపాలకూ ఆస్కారం ఇవ్వబోమని, తద్వారా బహ్రెయిన్ నుంచి ఇతర దేశాలకు తీవ్రవాదం లేదా ఇతర అసాంఘీక శక్తులువ ఎళ్ళే అవకాశం ఉండదని ప్రిన్స్ ఖలీఫా వివరించారు. గుడైబాలో జరిగిన ఓ సమావేశంలో ప్రైమ్ మినిస్టర్ ఈ వ్యాఖ్యలు చేశారు. కొన్ని కేసుల విచారణ ఇంకా వేగవంతంగా జరగాల్సి ఉంటుందని, దోషుల్ని కఠినంగా శిక్షించడమే కాకుండా త్వరగా శిక్షించడం కూడా ముఖ్యమని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ప్రిన్స్ ఖలీపా. ప్రపంచ దేశాలతో బహ్రెయిన్ ఎప్పుడూ కలిసి పనిచేస్తుందనీ, అంతర్జాతీయ భద్రత విషయంలో బహ్రెయిన్ తన సహాయ సహకారాలు అందిస్తుందని ఆయన అన్నారు. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్స్, ఫారిన్ మినిస్టర్, జస్టిస్, ఇస్లామిక్ ఎఫైర్స్ మరియు ఎండోమెంట్ మినిస్టర్, ఇన్ఫర్మేషన్ మినిస్టర్ మరియు పలువురు అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్









