తొక్కే కదా అని పారేస్తున్నారా.? మీ అందాన్ని కోల్పోయినట్లే.!
- August 28, 2024
అరటి పండు ఆరోగ్యానికి మంచిదే. అందరికీ తెలిసిందే. కానీ, అరటి తొక్క సంగతేంటీ.? తొక్కే కదా తేలిగ్గా తీసుకునేరు. మీరు తొందరగా ముసలివాళ్లయిపోతారు.అదేంటీ. ముసలి వాళ్లయిపోవడానికీ అరటి తొక్కకీ సంబంధం ఏంటీ.. అనుకుంటున్నారా.?
అవునండీ అరటి తొక్కకు యాంటీ ఆక్సిడెంట్స్ గుణం చాలా ఎక్కువ. ఇది చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. ముఖ్యంగా ముఖం మీది చర్మాన్ని ప్రీ రాడికల్స్ నుంచి కాపాడుతుంది.
అలాగే అరటి తొక్కలో విటమిన్ ఎ, జింక్, మాంగనీస్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చాలా ఎక్కువ. అంతే కాదండోయ్ ఏంటీ యాజింగ్ లక్షణాలు అరటి తొక్కలో పుష్కలంగా వున్నాయని తాజా సర్వేలో తేలింది.
అరటి తొక్కను పేస్ట్ చేసి, రెండు టేబుల్ స్పూన్ల తేనె, పెరుగు కలిపి ముఖానికి పట్టిస్తే ఏజ్ కారణంగా ముఖంపై వచ్చే ముడతలు మాయమైపోతాయ్.
అందుకే అరటి తొక్కను యాంటీ ఏజింగ్ కంటెంట్ అంటున్నారు. అయితే, ప్రస్తుతం అరటి పండ్లను నేచురల్‌గా పండనివ్వడం లేదు. కార్బైడ్ వంటి రసాయనాలతో మగ్గబెడుతున్నారు. ఇలా కెమికల్ కలిసిన అరటి తొక్కలను డైరెక్ట్‌గా వాడడం మంచిది కాదు. వాటిని ఓ పది నిమిషాల పాటు నీటిలో నాననిచ్చి తర్వాత ఫేస్ పేక్ చేసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్టులూ వుండవని నిపుణుల సలహా.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







