‘దేవర’ మూడో సాంగ్ నెక్స్‌ట్ లెవల్.!

- August 28, 2024 , by Maagulf
‘దేవర’ మూడో సాంగ్ నెక్స్‌ట్ లెవల్.!

ఎన్టీయార్ ప్రెస్టీజియస్ మూవీ ‘దేవర’నుండి మూడో సాంగ్ రానుంది. వినాయక చవితి సందర్భంగా ఈ లిరికల్  సాంగ్ రిలీజ్ చేయనున్నారని ఇన్‌సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం.

‘దేవర’ టైటిల్ సాంగ్ మొదలుకొని ‘చుట్టమల్లే చుట్టేశావే..’ రొమాంటిక్ సాంగ్ రెండింటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు రాబోయే మూడో సాంగ్ డాన్స్ నేపథ్యంలో వుంటుందట.

టోటల్‌గా ఐదు పాటల్లో రెండు పాటలకు బీభత్సంగా డాన్స్ చేశాడట ఎన్టీయార్. ఎన్టీయార్‌ని మ్యాచ్ చేసేలా హీరోయిన్ జాన్వీ కపూర్ చాలా కష్టపడి డాన్స్ చేసిందట.

ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యేలా ఈ పాటలో ఎన్టీయార్ స్టెప్పులుంటాయట. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు.

‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత ఎన్టీయార్ చేస్తున్న సినిమా ఇది. ప్యాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఎన్టీయార్ ఫ్యాన్స్ చాలా చాలా నమ్మకం పెట్టుకున్నారు. చూడాలి మరి, ఆ అంచనాల్ని ‘దేవర’ అందుకుంటుందో లేదో.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com