గ్రేటర్ సలాలా మాస్టర్‌ప్లాన్.. హౌసింగ్ ప్రాజెక్టులను సమీక్ష..!
- August 29, 2024
సలాలా: శాఖ గ్రేటర్ సలాలా, ఫ్యూచర్ సిటీ ఆఫ్ సలాలా కోసం మాస్టర్‌ప్లాన్‌కు సంబంధించిన అంశాలపై హౌసింగ్ మరియు అర్బన్ ప్లానింగ్ మంత్రిత్వశాఖ సమీక్ష నిర్వహించింది. అలాగే దోఫర్ గవర్నరేట్‌లో ప్రస్తుత మరియు భవిష్యత్తు గృహ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలను కూడా సమీక్షించారు. సలాలాలోని విలాయత్‌లో మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన సమావేశంలో దోఫర్ గవర్నర్ హిస్ హైనెస్ సయ్యద్ మర్వాన్ బిన్ తుర్కీ అల్ సయీద్, హౌసింగ్ మరియు అర్బన్ ప్లానింగ్ మంత్రి డాక్టర్ ఖల్ఫాన్ బిన్ సైద్ అల్ షుయైలీ, సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నరేట్ మునిసిపల్ కౌన్సిల్, గ్రేటర్ సలాలా మాస్టర్‌ప్లాన్ మరియు ఒమన్ విజన్ 2040 ప్రకారం ఇతర ప్రాంతాల ఆర్థిక అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించారు.
సలాలా ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్, రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయడం, సేవల నాణ్యతను పెంచడం, మౌలిక సదుపాయాలను పెంపొందించడంతో పాటు జనాభా పెరుగుదలకు అనుగుణంగా.. పెట్టుబడులను ఆకర్షించడానికి, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి దోహదపడే సమీకృత అభివృద్ధి, వ్యూహాత్మక ప్రణాళికలపై సమీక్షించారు. విలాయత్‌లలో పట్టణ ప్రాంతాలను మెరుగుపరచడానికి, అభివృద్ధి చేయడానికి గృహనిర్మాణ మరియు పట్టణ ప్రణాళికా మంత్రిత్వ శాఖ.. భవిష్యత్తు ప్రణాళిక, గృహనిర్మాణ కార్యక్రమాలు, ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై ధోఫర్ గవర్నరేట్‌లోని మున్సిపల్ కౌన్సిల్ సభ్యుల సూచనలు, అభిప్రాయాలను తెలుసుకుంది.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!