సినిమా రివ్యూ: ‘సరిపోదా శనివారం’.!
- August 29, 2024నేచురల్ స్టార్ నాని హీరోగా, ప్రియాంకా అరుళ్ మోహనన్ హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం ‘సరిపోదా శనివారం’. ఎస్.జె.సూర్య విలన్‌గా నటించాడు. వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో వచ్చిన నాని రెండో సినిమా ఇది. రిలీజ్‌కి ముందే మంచి బజ్ క్రియేట్ చేసుకుంది. ప్రమోషన్ల విషయంలోనూ నాని చాలా చాలా కష్టపడ్డాడు. అంతేకాదు, నాని నటించిన ప్యాన్ ఇండియా చిత్రం కూడా. మరి, బజ్‌కి తగ్గట్లుగా సినిమా అంచనాల్ని క్రియేట్ చేసిందా.? లేదా.? తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.!
కథ:
క్యాన్సర్ కారణంగా చనిపోయిన తల్లి (అభిరామి) మాట ప్రకారం తనకు చిన్నతనం నుంచీ వున్న ఆవేశాన్ని, కోపాన్నీ వారంలో ఒక్క రోజుకు మాత్రమే పరిమితం చేసుకుంటాడు సూర్య (నాని). అలా వారంలో జరిగిన సంఘటనలన్నీ బేరీజు వేసుకుని శనివారం తన ఆవేశాన్ని ప్రదర్శిస్తుంటాడు సూర్య. ఈ నేపథ్యంలోనే ఒక గొడవలో సూర్యకు చారులత (ప్రియాంకా అరుళ్ మోహనన్) పరిచయమవుతుంది. తొలి చూపులోనే వీళ్లిద్దరూ ప్రేమలో పడతారు. పోలీస్ కానిస్టేబుల్ అయిన చారులతకు గొడవలూ, వయలెన్స్ అంటే అస్సలు నచ్చదు. సూర్య తన శనివారం కోపం సీక్రెట్ గురించి చారులతకు చెప్పాలనుకున్న టైమ్‌లో అనుకోకుండా దయానంద్ (ఎస్.జె.సూర్య) తారసపడతాడు. చారులత పని చేస్తున్న పోలీస్ స్టేషన్ ఎస్సైనే ఈ దయా. పేరులో వున్న దయ ఆయనకు అస్సలుండదు. పరమ శాడిస్ట్. క్రూయల్ మైండెడ్. సోకుల పాలెం అనే ఊరి జనాలకు తన క్రూరత్వంతో చుక్కలు చూపిస్తుంటాడు. ఇదే సమయంలో దయాతో సూర్య గొడవకు దిగాల్సి వస్తుంది. గొడవలంటే నచ్చని చారులత తన ఎస్సైతో సూర్యకు గొడవను ఆపేందుకు ఓ ప్లాన్ చెబుతుంది. మరి ఆ ప్లాన్ ఏంటీ.? దయాతో గొడవ పడకుండా తన కోపాన్ని సూర్య కంట్రోల్ చేసుకోవడం కుదిరిందా.? సోకులపాలెం జనాలకీ సూర్యకీ సంబంధం ఏంటీ.? వారిని శాడిస్ట్ అయిన దయానంద్ నుంచి సూర్య ఎలా కాపాడాడు.? అనేది తెలియాలంటే ‘సరిపోదా శనివారం’ ధయేటర్లలో చూడాల్సిందే.
నటీనటుల పని తీరు:
నేచురల్ స్టార్ అనిపించుకోవడంలో మరోసారి నాని సక్సెస్ అయిపోయాడు సూర్య పాత్రలో. తనదైన నటనతో కట్టి పడేశాడు. ఈ సినిమా గురించి నాని ప్రమోషన్లలోనే మొత్తం చెప్పేశాడు. అందుకు తగ్గట్లుగానే సినిమా స్క్రీన్‌పై ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. సూర్య పాత్రలో నాని ఒదిగిన తీరు హ్యాట్సాఫ్. మరో నటుడు ఎస్.జె.సూర్య ఈ సినిమాకి బలం. సమ ఉజ్జీలుగా హీరో, విలన్ పాత్రల్ని తీర్చి దిద్దాడు డైరెక్టర్. ఆ పాత్రల్లో వాళ్లని తప్ప మరెవ్వరినీ ఊహించుకోలేం అన్నంతగా పర్‌ఫామెన్స్‌తో కట్టి పడేశారు. హీరోయిన్ ప్రియాంకా పాత్రకు ఎక్కువ స్కోప్ లేకపోయినప్పటికీ ఉన్నంతలో తనదైన నటనతో ఆకట్టుకుంది. దయానంద్ సోదరుడి పాత్రలో రాజకీయ నాయకుడిగా తనదైన అనుభవాన్ని రంగరించి నటించాడు మురళీ శర్మ. సాయి కుమార్, అభిరామి, విష్ణు ఓయ్ తదితర నటులు తమ తమ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.
సాంకేతిక వర్గం పనితీరు:
ఈ సినిమాకి కథ కొత్తదేమీ కాదు. కానీ, కథనం నడిపించిన తీరుకు వివేక్ ఆత్రేయను మెచ్చుకోకుండా వుండలేకపోతున్నారు. అసలు వివేక్ వంటి దర్శకుడితో ఇలాంటి ఓ కథని ఎవ్వరూ ఊహించలేరు. కానీ, తాను అనుకున్న కథని ప్రేక్షకుడు కన్విన్స్ అయ్యేలా చెప్పడంలో వివేక్ ఆత్రేయ వందకి వంద మార్కులేయించుకున్నాడు. అక్కడక్కడా కాస్త తడబడినా నాని చెప్పిన అంచనాల్ని అందుకోవడంలో ఫెయిల్ కాలేదు. సినిమాకి ప్రాణం బిజీమ్. జేక్స్ బిజోయ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాని నెక్స్‌ట్ లెవల్‌కి తీసుకెళ్లిందని చెప్పొచ్చు. పాటలు ఓకే అనిపించినా.. యాక్షన్ సీన్లలో బిజీమ్ దద్దరిల్లిపోయింది. మరో ముఖ్యమైన అంశం సినిమాటోగ్రఫీ. నాని కోపాన్నీ, ఎస్.జె సూర్య శాడిజం అనే మూడ్‌ని ప్రేక్షకుడు సైతం క్యారీ చేసేలా ఆ వాతావరణాన్ని క్రియేట్ చేశాడు. సన్నివేశాలకు తగ్గట్లుగా విజువల్ కళ్లకు కట్టేశాడు. డీవీవీ దానయ్య, దాసరి కుమార్ నిర్మాణ విలువలు బాగున్నాయ్. డైలాగులు ఓకే. ఎడిటింగ్ విషయంలో ఫస్టాఫ్ ఇంకాస్త ఫోకస్ పెట్టి వుంటే బాగుండేది. ఓవరాల్‌గా టెక్నికల్ టీమ్ వర్క్ గుడ్.
ప్లస్ పాయింట్స్:
నాని, ఎస్.జె సూర్య ట్రెమండస్ పర్‌పామెన్స్.. నువ్వా నేనా.. అన్న రీతిలో స్క్రీన్‌పై చెలరేగిపోయారంతే. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో ‘పోతారు.. అందరూ పోతారు..’ అనే డైలాగ్‌తో సెకండాఫ్‌ని అమితమైన ఆసక్తి క్రియేట్ చేశారు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ నెక్స్‌ట్ లెవల్.
మైనస్ పాయింట్స్:
ఫస్టాప్‌లో క్యారెక్టర్స్‌ని ఎస్టాబ్లిష్ చేయడం బాగుంది. కానీ, అక్కడక్కడా కాస్త సాగతీతలా అనిపిస్తుంది.
చివరిగా:
‘సరిపోదా శనివారం’ నాని చెప్పినదానికి సరిపోతుంది.నాని ఖాతాలో మరో హిట్ పడిపోయినట్లే.!
తాజా వార్తలు
- సీనియర్ హీరో రాజేంద్రప్రసాద్ ఇంట తీవ్ర విషాదం
- విద్యార్థుల నుంచి లంచం..టీచర్‌కు మూడేళ్ల జైలు, 5,000 దిర్హామ్‌ల జరిమానా..!!
- సౌదీయేతరులతోనే 64.8% సౌదీల వివాహాలు..అధ్యయనం వెల్లడి..!!
- షేక్ జాయెద్ రోడ్లో యాక్సిడెంట్.. 4.2 కి.మీ పొడవున ట్రాఫిక్ జామ్..!!
- దోహాలో రెండు కీలక రహదారులు తాత్కాలికంగా మూసివేత..!!
- కువైట్ లో తక్షణ చెల్లింపు కోసం 'WAMD' సర్వీస్ ప్రారంభం..!!
- మెట్రో రైడర్స్ కు గుడ్ న్యూస్.. ఈ-స్కూటర్లపై నిషేధం ఎత్తివేత..!!
- షార్ట్స్‌లో వీడియోల నిడివిని పెంచిన యూట్యూబ్
- కాంగో పడవ ప్రమాదంలో 78 మంది జల సమాధి
- రేపటి నుంచి భారత్–బంగ్లా టీ20 టిక్కెట్ల విక్రయం