నాగశౌర్య పెళ్ళికి రెడీ
- June 18, 2016
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని యంగ్ హీరోలలో నాగశౌర్య స్టైల్ ఎంతో ప్రత్యేకం. చూడటానికి చాలా కామ్ గా ఉంటూ, అలాగే కథలని సైతం చాలా డీసెంట్ గా సెలక్ట్ చేసుకుంటూ...వరుస మూవీలను సక్సెస్ దిశగా తీసుకుపోతున్న హీరో నాగశౌర్య. ఇలా నాగశౌర్య తన మూవీలకి మంచి కథలను సెలక్ట్ చేసుకుంటూ బాక్సాపీస్ వద్ద మినిమం గ్యారెంటీ మూవీగా నిలుస్తున్నాడు.
ఈ మధ్య కాలంలో నిర్మాతకి హీరో భరోసా ఇస్తున్నాడా?లేదా? అనేదే ముఖ్యం. అలాంటి కోణంలో చూస్తే నాగశౌర్య కచ్ఛితంగా భరోసాని ఇస్తున్నాడనే విషయం ఇండస్ట్రీ గుర్తించింది. ఇక ప్రస్తుతం నాగశౌర్య ఫిల్మ్ కెరీర్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంటే, ఇదే సమయంలో తను పెళ్ళి చేసుకునే పనిలో ఉన్నాడని అంటున్నారు.
ఇప్పటికే నాగశౌర్య కోసం ఓ అమ్మాయి సిద్ధంగా ఉన్నారని, అందుకు నాగశౌర్య సైతం అంగీకారం తెలిపాడని అంటున్నారు. అయితే ఈ విషయాలన్నీ చాలా కాన్ఫిడెంట్ గా ఉంచుతున్నారు నాగశౌర్య సంబంధికులు.
అయితే నాగశౌర్య ప్రెండ్స్ మాత్రం, ఈ సంవత్సరంలో నాగశౌర్య ఒకింటి వాడవుతాడని అంటున్నారు. ప్రస్తుతం నాగశౌర్య నటిస్తున్న చిత్రాలు మంచి సక్సెస్ రేటుని అందుకోవటంతో మార్కెట్ లో నాగశౌర్య మూవీలకి మంచి మార్కెట్ ఉంది. ఒక మనస్సు, జ్యో అచ్ఛుతానంద చిత్రాలు నాగశౌర్య చేతిలో ఉన్నాయి.
ఈ రెండు బాక్సాపీస్ వద్ద మంచి విజాయాన్ని అందుకుంటాయని భావిస్తున్నారు. మొత్తంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే మంచి సక్సెస్ లను అందుకుంటున్నాడు. ఇటువంటి సమయంలో పెళ్ళి చేసుకోవాలనే నిర్ణయం తీసుకోవటంతో....చాలా మంది యంగ్ హీరోలు షాక్ అవుతున్నారు. ఎందుకంటే నాగశౌర్య కంటే ఎంతో సీనియారిటి ఉన్న చాలా మంది ముదురు యూత్ హీరోలు తీసుకోని నిర్ణయం... నాగశౌర్య తీసుకోవటమే!
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









