మాస్ రాజా హీరోయిన్ మలయాళ హీరోతో.!
- September 10, 2024
‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన ముద్దుగుమ్మ భాగ్యశ్రీ బోర్సే. మాస్ రాజా రవితేజతో అమ్మడి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అదరహో అనిపించినా.. సినిమా ఆశించిన సక్సెస్ అందుకోలేకపోయింది.
అయినా భాగ్యశ్రీ బోర్సేకి మాత్రం టాలీవుడ్లో పిచ్చ పిచ్చగా ఫాలోయింగ్ వచ్చిందనుకోండి. తదుపరి బోలెడన్ని సినిమాలు అమ్మడి కోసం క్యూ కట్టేస్తాయనుకున్నారు.
అయితే, టాలీవుడ్ సంగతెలా వున్నా.. పాప మలయాళంలో ఓ బంపర్ ఛాన్స్ కొట్టేసింది. మలయాల హ్యాండ్సమ్ హీరో దుల్కర్ సల్మాన్ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా ఎంపికైంది.
ఈ సినిమాకి రానా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ‘కాంతా’ అనే టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమా లేటెస్ట్గా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమాని మలయాళంతో పాటూ, తెలుగు, తమిళ భాషల్లోనూ రిలీజ్ చేయనున్నారు.
దుల్కర్ సల్మాన్‌కి ఇప్పటికే తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ వున్న సంగతి తెలిసిందే. సో, ఈ సినిమాతో ఇంకోసారి భాగ్యశ్రీ బోర్సే హాట్ టాపిక్ అయ్యింది. అలాగే, మరిన్ని సినిమాలు భాగ్యశ్రీ బోర్సే ఖాతాలో పడే అవకాశముంది ప్రస్తుతం టాలీవుడ్లో వున్న పరిస్థితికి.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!