పార్కింగ్‌ వద్దే లగేజీ అప్పగింత.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో కొత్త సదుపాయం

- September 10, 2024 , by Maagulf
పార్కింగ్‌ వద్దే లగేజీ అప్పగింత.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో కొత్త సదుపాయం

హైదరాబాద్‌: శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులకు 'సిటీ సైడ్‌ చెక్‌-ఇన్‌ అండ్‌ బ్యాగేజ్‌ డ్రాప్‌ ఫెసిలిటీ' పేరిట కొత్త సదుపాయాన్ని ఎయిరిండియా అందుబాటులోకి తెచ్చింది.

ఎయిరిండియా, విస్తారా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణికులకు ఈ సదుపాయం లభిస్తుంది. ప్రయాణికులు తమ బ్యాగేజీని 'డిపార్చర్‌ లెవల్‌' వరకు తీసుకువెళ్లే అవసరం లేకుండా, వాహనాల పార్కింగ్‌ - బస్టాండుకు సమీపంలో, గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న కౌంటర్‌లోనే అప్పగించే అవకాశం కల్పిస్తున్నట్లు ఎయిర్‌ ఇండియా వెల్లడించింది. విమానం బయలుదేరడానికి 6 గంటల ముందు నుంచి, 90 నిమిషాల ముందు వరకు ఇక్కడ ప్రయాణికుల చెక్‌ ఇన్‌ బ్యాగులు తీసుకుంటారు. బ్యాగులు కిందే ఇచ్చేయడం వల్ల ప్రయాణికులకు చెక్‌-ఇన్‌ ప్రక్రియ సులువవుతుందని, సమయం ఆదా అవుతుందని పేర్కొంది. ఇటీవల హైదరాబాద్‌ విమానాశ్రయంలో సెల్ఫ్‌ బ్యాగ్‌ డ్రాప్‌ (ఎస్‌బీడీ) మెషీన్లను ఎయిరిండియా ఏర్పాటు చేసింది. దీనివల్ల బ్యాగేజీ అప్పగింత సమయం కూడా ఆదా అవుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com