గ్రేట్ ప్లేసెస్ టు వర్క్ ర్యాంకింగ్స్.. ఖతార్ నుంచి 15 కంపెనీలకు చోటు.. !

- September 10, 2024 , by Maagulf
గ్రేట్ ప్లేసెస్ టు వర్క్ ర్యాంకింగ్స్.. ఖతార్ నుంచి 15 కంపెనీలకు చోటు.. !

దోహా: ఖతార్ లోని సంస్థలు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన పనితీరును ప్రదర్శిస్తున్నాయి. ఈ సంవత్సరం టాప్ 200 గ్రేట్ ప్లేసెస్ టు వర్క్ మిడిల్ ఈస్ట్ ఖతార్‌లో పనిచేస్తున్న 15 కంపెనీలు స్థానం సంపాదించాయి.  2024 ఆసియాలోని ఉత్తమ కార్యాలయాల జాబితాలో టాప్ 30 మల్టీ నేషనల్, టాప్ 100 చిన్న మధ్యస్థ కంపెనీలు, టాప్ 70 పెద్ద సంస్థలు ఉన్నాయి. అల్ మనా రెస్టారెంట్లు & ఫుడ్ కో., అపెరల్ గ్రూప్, MAERSK, BDP ఇంటర్నేషనల్, లెమినార్, హిల్టన్ వంటి కొన్ని కంపెనీలు ఖతార్ నుండి జాబితాలో స్థానం పొందాయి. గ్రేట్ ప్లేస్ టు వర్క్ మిడిల్ ఈస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ జూల్స్ యూసఫ్ మాట్లాడుతూ..ఇటీవలి సంవత్సరాలలో ఆసియాలో అత్యుత్తమ వర్క్‌ప్లేస్‌ల జాబితాలో ఖతార్‌లోని కంపెనీల సంఖ్య క్రమంగా పెరుగుతుందన్నారు. ఈ ట్రెండ్ తమ ఉద్యోగులకు అనుకూలమైన పని వాతావరణాన్ని కల్పించడంలో ఖతార్ కంపెనీల నిబద్ధతను ప్రదర్శిస్తున్నాయని కొనియాడారు.  కార్మికుల విశ్వాసం, ఆవిష్కరణలు, కంపెనీ విలువలు తదితర అంశాలను బట్టి ర్యాంకింగ్‌లను కేటాయించారు.  గ్రేట్ ప్లేసెస్ టు వర్క్ ప్రకారం.. 89 శాతం మంది ఉద్యోగులు, సంస్థలు మెరుగైన పని పరిస్థితులను అమలు చేయడానికి కొత్త వ్యూహాత్మక పద్ధతులను అమలు చేస్తున్నాయి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com