19 ఏళ్ళ కుర్రాడి చేతిలో ఫెదరర్‌ ఓటమి

- June 19, 2016 , by Maagulf
19 ఏళ్ళ కుర్రాడి చేతిలో ఫెదరర్‌ ఓటమి

టెన్నిస్‌ చరిత్రలో పదిహేడు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు సొంతం చేసుకున్న విజేత రోజర్‌ ఫెదరర్‌. గత కొంత కాలంగా ఫామ్‌ కోల్పోయి సతమతమవున్నాడు. తాజాగా హల్లె ఓపెన్‌ సెమీఫైనల్లో 19 ఏళ్ల జర్మనీ కుర్రాడు జ్వెరెవ్‌ చేతిలో ఓటమి చవిచూశాడు. దీంతో 9వ సారి హల్లె టైటిల్‌ సొంతం చేసుకోవాలనుకున్న ఫెదరర్‌ ఆశలు నెరవేరలేదు. ఎనిమిది సార్లు హాల్లె టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్న రోజర్‌ను శనివారం రాత్రి జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో 19 ఏళ్ల యువ జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ 7-6 (4), 5-7, 6-3 తేడాతో ఓడించాడు. పదేళ్ల తర్వాత స్విస్‌ స్టార్‌ ఓ యువకుడి చేతిలో పరాజయం పాలవడం ఇదే తొలి సారి. 2006లో బ్రిటన్‌ స్టార్‌ ప్లేయర్‌ ఆండీ ముర్రే.. ఫెదరర్‌ను ఓడించాడు. జ్వెరెవ్‌ తన కెరీర్‌లో రెండో ఏటీపీ టూర్‌ ఫైనల్‌కు చేరుకోవడం విశేషం. మరో సెమీ ఫైనల్‌ల్లో ఆస్ట్రేలియాకు చెందిన డొమినిక్‌ థీమ్‌, జర్మనీ ఆటగాడు ఫ్లోరియన్‌ మెయర్‌ తలపడనున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com