మహేష్, బాలయ్య సినిమా...
- June 19, 2016
టాలీవుడ్ నెంబర్ వన్ సీటు ఎవరది అన్న ప్రశ్న వస్తే పోటీ పడే వారిలో మొదటి రెండు స్థానాల్లో కచ్చితంగా మహేష్ బాబు పేరు వినపడుతుంది. ఇక సీనియర్ స్టార్ హీరోల్లో నందమూరి నట సింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇప్పుడు అటు ఘట్టమనేని ఫ్యాన్స్.. ఇటు నందమూరి అభిమానులు పండుగ చేసుకునే ఓ న్యూస్ ఫిల్మ్ నగర్ లో చెక్కర్లు కొడుతుంది.. అదే బాలయ్య, మహేష్ ల మల్టీస్టారర్ మూవీ.
ఎవరికి వారి తమ సత్తా చాటుతున్న ఈ తరుణంలో మల్టీస్టారర్ సినిమాలకు ఓ క్రేజ్ తీసుకువచ్చారు మహేష్ వెంకటేష్ నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో.. ఇక ఇప్పుడు అతి తక్కువ కాలలోనే క్రేజీ ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించిన సాయి కొర్రపాటి ఈ భారీ మల్టీస్టారర్ కు నడుం బిగించాడు.
తన క్రేజ్ తో సినిమా సినిమాకు కొత్త ఉత్సాహంతో ఉరకలేస్తున్న మహేష్ కెరియర్ లో ఏ స్టార్ హీరో చేయని సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఇక మరో పక్క బాలయ్య కూడా వందవ సినిమా క్రేజీ ప్రాజెక్ట్ గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు. అయితే మహేష్, బాలయ్య సినిమా దర్శకుడు ఎవరు అన్నది ఇంకా ఫైనలైజ్ కాలేదు.
ప్రస్తుతం మహేష్ కూడా మురుగదాస్ సినిమాతో బిజీ అవనున్నాడు. ఇక బాలకృష్ణ శాతకర్ణి సినిమా పూర్తయ్యే దాకా వేరే సినిమాకు అవకాశం లేదు. ప్రస్తుతం రూమర్ లా వస్తున్న ఈ వార్త నిజమైతే కనుక ఇక ఆ సినిమాకు అటు నందమూరి, ఘట్టమనేని ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేయడం మాములే.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









