శర్వానంద్ సైలెంట్ అయిపోయాడేం.!
- September 19, 2024
మినిమమ్ గ్యారంటీ హీరోల్లో శర్వానంద్ ఒకడు. ఒకప్పుడు విలక్షణ కథల్ని ఎంచుకునే శర్వానంద్ ‘రన్ రాజా రన్’ సినిమాతో ట్రాక్ మార్చేశాడు.
కామెడీ హీరో అవతారమెత్తాడు. సక్సెస్లూ చవి చూశాడు. అయితే వివాహానంతరం శర్వానంద్ కెరీర్ స్లో అయ్యింది. పెళ్లి తర్వాత పెద్దగా కొత్త ప్రాజెక్టులేమీ సైన్ చేసినట్లు లేడు.
ఇక, రీసెంట్గా వచ్చిన ‘మనమే’ని డిజాస్టర్ అనాలో, ఫెయిల్యూర్ అనాలో తెలియని పరిస్థితి. ధియేటర్లలో రిలీజైంది కానీ, నెలలు గడుస్తున్నా.. ఈ సినిమా ఎందుకో ఓటీటీలో రిలీజ్ కాలేదు. నిర్మాతల మధ్య గొడవలే ఇందుకు కారణంగా చెబుతున్నారు.
చిన్న సినిమాలు సైతం ఓటీటీలో ఈజీగా రిలీజ్ అవుతున్నాయ్. ధియేటర్లలో చెప్పుకోదగ్గ ఆదరణ పొందలేకపోయినప్పటికీ, ఓటీటీ ప్రేక్షకులు నచ్చితే బ్రహ్మరధం పడుతున్నారు.
అలాంటిది శర్వానంద్ సినిమా ఓటీటీలో ఇంతవరకూ రాకపోవమేంటో అర్ధం కావడం లేదు. ఆ సంగతి అటుంచితే, శర్వా కొత్త ప్రాజెక్ట్ సంపత్ నంది దర్శకత్వంలో వుండబోతోందనీ తెలుస్తోంది. ఇంత స్లోగా వుంటే కష్టమే మరి, శర్వా కాస్త స్పీడు పెంచాలని ఆయన అభిమానులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!