బిగ్‌బాస్: ‘ఆమె’ వల్ల అతని గేమ్ చెడిందా.?

- September 19, 2024 , by Maagulf
బిగ్‌బాస్: ‘ఆమె’ వల్ల అతని గేమ్ చెడిందా.?

బిగ్‌బాస్ తెలుగు 8 వ సీజన్ చాలా చప్పగా సాగుతోంది. పెద్దగా ఆడియన్స్ ఇంట్రెస్ట్  చూపించడం లేదు. హౌస్‌లో కంటెస్టెంట్స్ విషయానికి వస్తే, తమ వంతుగా ప్రయత్నిస్తున్నారు, ఒకరిపై ఒకరు గొడవలు పెట్టుకుంటూ థర్టీ పాలిటిక్స్ కూడా క్రియేట్ చేసుకుంటున్నారు. కానీ, పెద్దగా వర్కవుట్ అవుతున్నట్లు కనిపించడం లేదు.

ఇక, మూడో వారం కూడా తిరిగొచ్చేసింది. ఇప్పటికే హౌస్ నుంచి బేబక్క, శేఖర్ భాషా ఎలిమినేట్ అయ్యారు. మూడో వారం ఎవరు వెళతారా.? అన్నదానిపై ఒకింత ఆసక్తి నెలకొంది.

కన్నడ బ్యూటీ ప్రేరణను ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇది అత్యవసరమైన ఎలిమినేషన్ అని సమాచారం. కాగా, హౌస్‌లో జెంటిల్‌మెన్‌గా పేరు తెచ్చుకున్న నిఖిల్ ఆట తీరు ఒకింత హాట్ టాపిక్ అయ్యింది.

అందుకు కారణం సోనియా ఆకుల. మొదట్లో నిఖిల్ చాలా డిగ్నిఫైడ్‌గా వ్యవహరించేవాడు. కానీ, పోను పోను సోనియాతో సావాసం పెట్టుకోవడం.. మెల్ల మెల్లగా తన ఆట పక్కదారి పట్టిందంటూ హౌస్‌లోని మిగతా కంటెస్టెంట్సే ప్రచారం చేస్తున్నారు.

అవును నిజమే, అయినదానికీ కాని దానికి సోనియా గొడవలు పెట్టుకుంటోందన్న ఆరోపణ కూడా వుంది. అయితే, తనదైన ఆటిట్యూడ్‌తో ఆటలో ముందుకెళుతోంది సోనియా. ఆ తరహా ఆటిట్యూడే మిగిలిన కంటెస్టెంట్లకు నచ్చడం లేదు కాబోలు బహుశా. ఆమె అంటేనే మండి పడుతున్నారు ముఖ్యంగా లేడీ కంటెస్టెంట్లు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com