ఖతార్‌కు రికార్డు స్థాయిలో పర్యాటకులు.. 8 నెలల్లో 3.3 మిలియన్ల విజిటర్స్..!!
- September 22, 2024
దోహా: ఖతార్ 2024 సంవత్సరం అత్యధిక పర్యాటకుల సంఖ్యను నమోదు చేయనుంది. ఇప్పటికే గత 8 నెలల్లో దాదాపు 3.3 మిలియన్ల మంది విజిటర్స్ వచ్చారు. గత సంవత్సరం, ఖతార్ నాలుగు మిలియన్లకు పైగా సందర్శకులను స్వాగతించింది. ఇప్పటివరకు ఇది అత్యధిక సంఖ్యగా ఉంది. అధికారిక లెక్కల ప్రకారం.. 2024లో ఇప్పటివరకు 3.284 మిలియన్ల మంది దేశాన్ని సందర్శించారు. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 26 శాతం పెరగడం విశేషం. 2024లో 4.5 మిలియన్లు, 2025 నాటికి 4.9 మిలియన్లకు విజిటర్స్ సంఖ్య పెరుగుతుందని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏడాది పొడవునా అనేక పర్యాటక ఆఫర్ల కారణంగా ఖతార్‌కు రికార్డు సంఖ్యలో పర్యాటకులు వస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్