దుబాయ్ మెట్రోలో కుప్పకూలిన ప్రయాణీకుడు..ఎమర్జెన్సీ సమయంలో ఏం చేయాలంటే..!!

- September 23, 2024 , by Maagulf
దుబాయ్ మెట్రోలో కుప్పకూలిన ప్రయాణీకుడు..ఎమర్జెన్సీ సమయంలో ఏం చేయాలంటే..!!

యూఏఈ: దుబాయ్ మెట్రోలో ప్రయాణీకుడికి మూర్ఛ వచ్చి, బిజినెస్ బే స్టేషన్ నుండి బయలుదేరిన కొద్దిసేపటికే ఆన్‌పాసివ్‌లో తదుపరి స్టాప్‌తో కోచ్‌లో కుప్పకూలాడు.  సుమారు 10 రోజుల క్రితం జరిగిందని అధికారులు వివరించారు.  కాగా, స్టేషన్ల మధ్య ఎక్కువ దూరం ఉండడంతో అస్వస్థతకు గురైన ప్రయాణీకుడి కోసం చాలా మంది ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. సరైన ప్రోటోకాల్ గురించి తెలియకపోయినప్పటికీ, కొంతమంది ప్రయాణికులు మెట్రో సిబ్బందిని అప్రమత్తం చేయడానికి అత్యవసర బటన్‌ను నొక్కారు.   

"మేము ఏమి చేయాలో తెలియక ఎమర్జెన్సీ బటన్‌ను నొక్కాము. మేము వ్యక్తి కోసం ఆందోళన చెందుతున్నాము" అని పలువురు ఈ సంఘటన గురించి తమ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.  రైలు ఆన్‌పాసివ్ వద్దకు చేరుకోగానే ప్రయాణీకుడు స్పృహలోకి వచ్చాడు. అనంతరం స్టేషన్‌లో దిగిపోయాడు. మెట్రో సిబ్బంది కూడా వచ్చి ఏదైనా అత్యవసర సహాయం అవసరమా అని ఆరా తీశారు.

మెట్రో లో అత్యవసర విధానాలపై స్పష్టత కోసం భద్రతా ప్రోటోకాల్ పాటించాలని ప్రయాణికులకు దుబాయ్ రోడ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) సూచించింది.  తోటి ప్రయాణీకులకు అత్యవసర వైద్య సహాయం అవసరమైతే స్టేషన్ సిబ్బందిని సంప్రదించవచ్చు.  ప్రతి దుబాయ్ మెట్రో రైళ్లలో అమర్చిన ఎమర్జెన్సీ కాల్ బాక్స్ (ECB)ని ఉపయోగించి ప్రయాణికులు ఏదైనా అత్యవసర పరిస్థితిని నివేదించవచ్చు. రైళ్ల లోపల ప్రథమ చికిత్స వస్తు సామగ్రి లేనప్పటికీ, అన్ని రకాల అత్యవసర పరిస్థితులను నిర్వహించడానికి బోర్డులోని సహాయకులు పూర్తిగా శిక్షణ పొందారు. అలాగే మెట్రో స్టేషన్లలో ప్రథమ చికిత్స గదులు ఉంటయి. స్టేషన్‌ల మధ్య సాధారణ సమయం రెండు నుండి మూడు నిమిషాలు, అత్యవసర పరిస్థితుల్లో, రోగిని సుమారు 10 నిమిషాలలో సహాయం కోసం తరలించవచ్చని తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com