కువైట్ క్రౌన్ ప్రిన్స్‌తో ప్రధాని మోదీ కీలక సమావేశం..!!

- September 23, 2024 , by Maagulf
కువైట్ క్రౌన్ ప్రిన్స్‌తో ప్రధాని మోదీ కీలక సమావేశం..!!

కువైట్: కువైట్ క్రౌన్ ప్రిన్స్, షేక్ సబా ఖలీద్ అల్-హమద్ అల్-సబా అల్-సబాతో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం న్యూయార్క్‌లో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. "కువైట్ క్రౌన్ ప్రిన్స్, హిస్ హైనెస్ షేక్ సబా ఖలీద్ అల్-హమద్ అల్-సబాతో చర్చలు చాలా సంతృప్తికరంగా  జరిగాయి. ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్నాలజీ, ఎనర్జీ వంటి మరిన్ని రంగాలలో భారత్-కువైట్ సంబంధాలను ఎలా బలోపేతం చేయాలో మేము చర్చించాము.’’ అని కువైట్ యువరాజుతో భేటీ అనంతరం మోదీ ట్వీట్ చేశారు.

సెప్టెంబర్ నెల ప్రారంభంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కువైట్ విదేశాంగ మంత్రి అబ్దుల్లా అలీ అల్-యాహ్యాతో సమావేశమయ్యారు. భారతదేశం-కువైట్ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంపై చర్చించారు. వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధికారిక డేటా ప్రకారం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో గల్ఫ్ దేశానికి భారతీయ ఎగుమతులు USD 2.10 బిలియన్లకు చేరుకోవడంతో కువైట్‌తో భారతదేశ వాణిజ్యం పెరుగుదలను నమోదు చేసింది.

మూడు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ న్యూయార్క్ చేరుకున్నారు. అనంతరం ప్రధాని మోదీ క్వాడ్ సమ్మిట్‌లో పాల్గొన్నారు.  అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్,  జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com