యూఏఈలో వచ్చే రెండు నెలల్లో భారీగా వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- September 24, 2024
యూఏఈ: యూఏఈ నివాసితులు వాతావరణ మార్పుల కోసం సిద్ధం కావాలని, రాబోయే రెండు నెలల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియరాలజీ (NCM) నుండి వాతావరణ నిపుణుడు డాక్టర్ అహ్మద్ హబీబ్ వివరించారు. రాబోయే రోజుల్లో వాతావరణంలో వేగవంతమైన మార్పులు చోటుచేసుకుంటాయన్నారు. అల్పపీడన వ్యవస్థ పశ్చిమం నుండి విస్తరించి, గాలిలోకి తేమను పెరుగుతుందన్నారు. దీంతో పొగమంచు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని హబీబ్ తెలిపారు. సాధారణంగా సెప్టెంబరు నెలను వేసవి చివరి నెలగా పరిగణిస్తారు. ఆ తర్వాత ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయి. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 42°C నుండి 45°C వరకు ఉన్నాయని, అక్టోబర్ నాటికి రెండు నుండి మూడు డిగ్రీలు తగ్గుతాయన్నారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్