షార్జాలో కొత్త అద్దె చట్టం.. 15 రోజులలోపు ఒప్పందాలు.. ఉత్తర్వులు జారీ..!!

- September 24, 2024 , by Maagulf
షార్జాలో కొత్త అద్దె చట్టం.. 15 రోజులలోపు ఒప్పందాలు.. ఉత్తర్వులు జారీ..!!

షార్జా: షార్జాలో కొత్త లీజింగ్ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ మేరకు షార్జా పాలకులు, సుప్రీం కౌన్సిల్ సభ్యుడు షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ ఖాసిమి ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం షార్జాలోని ఓనర్స్ అద్దె ఒప్పందాలను జారీ చేసిన 15 రోజులలోపు ఆమోదించవలసి ఉంటుంది. ఎమిరేట్‌లో నివాస, వాణిజ్య, పారిశ్రామిక లేదా వృత్తిపరమైన ప్రయోజనాల కోసం అద్దెకు తీసుకున్న ఆస్తులపై ఈ చట్టంలోని నిబంధనలు వర్తిస్తాయని పేర్కొన్నారు.  పేర్కొన్న వ్యవధిలోపు లీజు ఒప్పందాన్ని ఆమోదించడానికి ఓనర్ నిరాకరిస్తే, అద్దెదారు దానిని ఆమోదించమని కోర్టును ఆశ్రయించవచ్చు. చట్టంలోని నిబంధనలు ఉల్లంఘిస్తే అద్దెదారుపై పరిపాలనాపరమైన జరిమానా విధించబడుతుందని హెచ్చరించారు. అయితే, వ్యవసాయ భూములు, నివాస అవసరాల కోసం ఎమిరేట్ ప్రభుత్వం మంజూరు చేసిన ఆస్తులు, యాజమాన్యాలు అద్దె లేకుండా పని చేసే వారి కోసం అందించిన ఆస్తులపై ఈ చట్టం వర్తించదని స్పష్టం చేశారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com