బీరుట్ కు విమానాలను నిలిపివేసిన ఖతార్ ఎయిర్‌వేస్..!!
- September 25, 2024
దోహా: ఇజ్రాయెల్ -హిజ్బుల్లాల మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో బుధవారం వరకు బీరూట్‌కు విమానాలను నిలిపివేసినట్లు ఖతార్ ఎయిర్‌వేస్ తెలిపింది. "లెబనాన్‌లో కొనసాగుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఖతార్ ఎయిర్‌వేస్ సెప్టెంబర్ 25 వరకు బీరుట్ రఫిక్ హరిరి అంతర్జాతీయ విమానాశ్రయానికి విమానాలను తాత్కాలికంగా నిలిపివేసాము." అని ఖతార్ జాతీయ క్యారియర్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇదిలా ఉండగా, లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో సోమవారం 35 మంది చిన్నారులు సహా కనీసం 492 మంది మరణించారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత వారం ఖతార్ ఎయిర్‌వేస్ తన బీరుట్ విమానాలలో పేజర్లు మరియు వాకీ-టాకీలపై నిషేధాన్ని ప్రకటించింది. లేబనాన్ లో మ్యూనికేషన్స్ డివైజ్ పేలుళ్లలో 37 మంది మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. కాగా, జర్మనీకి చెందిన లుఫ్తాన్సా, ఎయిర్ ఫ్రాన్స్ , యునైటెడ్ స్టేట్స్‌కు చెందిన డెల్టా ఎయిర్ లైన్స్ కూడా బీరూట్‌కు విమానాలను నిలిపివేసాయి.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!