11 ఏళ్ల చిన్నారికి క్షమాపణలు చెప్పిన రియాల్టీ షో మేకర్స్..!!
- September 25, 2024
యూఏఈ: చిత్రీకరణ సమయంలో బెదిరింపులకు గురైన 11 ఏళ్ల బాలికకు రియాలిటీ షో నిర్వహకులు క్షమాపణలు తెలిపారు. షో మేకర్స్ అధికారికంగా ఎమిరాటీ సంఘం, యువతి మరియు ఆమె కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెప్పారు. అంతర్జాతీయ ఫ్యాషన్ బ్రాండ్ మద్దతుతో డిజైన్ పోటీ చిత్రీకరణ సమయంలో అల్ షెహి తీవ్ర బెదిరింపులను ఎదుర్కొంది. ప్రజల ఆగ్రహం వ్యక్తం కావడంతో షో మేకర్స్ దిగొచ్చి క్షమాపణలు చెప్పారు. బెదిరింపుల అనంతరం బాలిక మానసిక క్షోభను అనుభవించింది. ఫలితంగా ఆమె ఒక వారం కంటే ఎక్కువ కాలం ఆసుపత్రిలో చెరి చికిత్స తీసుకుంది. మజాజ్ ఛానెల్లోని అల్'అబ్ అల్ నోజూమ్ (స్టార్ గేమ్స్) కార్యక్రమంలో గత వారం ప్రసారమైన ఎపిసోడ్ సందర్భంగా ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. ఈ సంఘటనను చాలా సీరియస్గా తీసుకుంటామని, మా కంటెంట్ మీడియా కంటెంట్ ప్రమాణాలు, దేశంలోని మీడియా రంగాన్ని నియంత్రించే చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా ఉండేటట్టు సమీక్షించుకోనున్నట్లు షో మేకర్స్ వెల్లడించారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!