కువైట్ రాయబారితో సంబంధాలపై భారత మంత్రి చర్చలు..!!
- September 25, 2024
కువైట్: భారతదేశంలోని కువైట్ రాష్ట్ర రాయబారి మెషల్ అల్షెమాలి..భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్‌తో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై వారు చర్చించారు. రాయబారి అల్షెమాలి మాట్లాడుతూ.. ఆర్థిక, వాణిజ్యం సాంస్కృతిక రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడానికి చేసిన ప్రయత్నాలను ప్రశంసించారు. కువైట్‌లో నివసిస్తున్న భారతీయ ప్రవాస సమాజానికి అందించిన మద్దతు కోసం కువైట్ నాయకత్వానికి భారత మంత్రి ధన్యవాదాలు తెలియజేశారు. రెండు స్నేహపూర్వక దేశాల మధ్య బలమైన చారిత్రాత్మక సంబంధాలను రాయబారి ఈ సందర్భంగా గుర్తు చేసారని అధికార యంత్రాంగం ఒక ప్రకటనలో తెలిపింది. గత జూన్‌లో కువైట్‌లోని మంగాఫ్ నగరంలోని నివాస భవనంలో అగ్నిప్రమాదంలో 49 మంది భారతీయులు మరణించిన సమయంలో భారత మంత్రి కువైట్‌ను సందర్శించి పరిస్థితిన స్వయంగా సమీక్షించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!