యూఏఈలో క్రెడిట్ కార్డ్ మోసాలు.. రుణాలతో బురిడీ కొట్టిస్టున్న మోసగాళ్లు..!!

- September 28, 2024 , by Maagulf
యూఏఈలో క్రెడిట్ కార్డ్ మోసాలు.. రుణాలతో బురిడీ కొట్టిస్టున్న మోసగాళ్లు..!!

యూఏఈ: భారతీయ ప్రవాసుడు అజోయ్ జోసెఫ్ ఎమిరేట్స్ ID ఫోటో కాపీతో మూడు క్రెడిట్ కార్డ్‌లను తీసుకున్నారు. ఒక్కొక్కటి గరిష్టంగా 30,000 దిర్హామ్‌లు. ఈ కార్డుల గురించి తనకు ఎలాంటి అవగాహన లేదని భారతీయ ప్రవాసుడు పేర్కొన్నాడు. స్కామర్లు బ్యాంక్ స్టేట్‌మెంట్‌లను OTPలను దారిమళ్లించారు. అయితే, దరఖాస్తు చేసుకున్న వ్యక్తి ఐడీని ధృవీకరించకుండా బ్యాంకులు ఈ క్రెడిట్ కార్డులను ఎలా జారీ చేశాయన్నది అసలు రహస్యం. జోసెఫ్ స్కామ్‌ను వెలికితీయగా, సహాయం చేయడానికి బ్యాంకులు సహకరించలేదు. చట్టపరమైన బెదిరింపులతో రుణం Dh120,000కి పెరిగింది. ఆరు నెలల న్యాయ పోరాటం తర్వాత, రెండు బ్యాంకులు చివరకు పశ్చాత్తాపం వ్యక్తం చేసాయి. ఛార్జీలను మాఫీ చేశాయి. కానీ మూడో కార్డు ఇప్పటికీ కొనసాగుతోందని జోసెఫ్ తెలిపారు.

యూఏఈ అంతటా నివాసితులు సైబర్ మోసాల బారీన పడుతున్నారు. బ్యాంకులతో పోరాటం చేస్తున్నారు. సైబర్ సెక్యూరిటీ హెడ్ డాక్టర్ మహ్మద్ అల్ కువైటీ ప్రకారం.. యూఏఈలో సైబర్ దాడుల సంఖ్య పెరుగుతున్నందున, ప్రభుత్వ రంగ సంస్థలు ఇప్పుడు రోజుకు సగటున 50,000 మోసాలకు సంబంధించిన కాల్స్ వస్తున్నట్లు తెలిపాయన్నారు. ఇందులో ఫిషింగ్, DDoS మరియు రాన్సమ్ వేర్ వంటివే అధికమని తెలిపారు.  OTPలు లేకుండా ఖాతాలు ఖాళీ చేయబడటం నుండి, ఎప్పుడూ చేయని లావాదేవీల కోసం క్రెడిట్ కార్డ్‌లకు ఛార్జ్ ల వరకు మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు వస్తున్నట్లు నివేదికల్లో పేర్కొన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com