స్వతంత్ర పాలస్తీనా రాజ్య స్థాపన..జీసీసీ-అమెరికా విదేశాంగ మంత్రులు మద్దతు..!!
- September 28, 2024
న్యూయార్క్: గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి), యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యుఎస్) న్యూయార్క్‌లో సంయుక్త మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి US సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ J. బ్లింకెన్, ఖతార్ ప్రధాన మంత్రి- విదేశాంగ మంత్రి, GCC మినిస్టీరియల్ కౌన్సిల్ ప్రస్తుత ఛైర్మన్ షేక్ మొహమ్మద్ అబ్దుల్‌రహ్మాన్ అల్ థానీ సహ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో జిసిసి విదేశాంగ మంత్రులు మరియు జిసిసి సెక్రటరీ జనరల్ జాసెమ్ అల్ బుదైవి పాల్గొన్నారు. జీసీసీ, యునైటెడ్ స్టేట్స్ మధ్య సహకారాన్ని బలోపేతం చేస్తామని వారు స్పష్టం చేశారు.
2002 అరబ్ పీస్ ఇనిషియేటివ్‌కు అనుగుణంగా 1967లో అంగీకరించిన సరిహద్దులతో స్వతంత్ర పాలస్తీనా రాజ్య స్థాపనకు మంత్రులు తమ మద్దతును వ్యక్తం చేశారు. అక్టోబరు 7 తర్వాత నిర్వాసితులైన పౌరులందరినీ వారి ఇళ్లకు తిరిగి వెళ్లేందుకు అనుమతించాల్సిన ఆవశ్యకతను మంత్రులు స్పష్టం చేశారు. పాలస్తీనా అథారిటీ కింద గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్‌లో పాలస్తీనా నేతృత్వంలో పాలన తప్పనిసరిగా ఉండాలని మంత్రులు తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా పాలస్తీనియన్ల స్వీయ-నిర్ణయాధికారం ఆకాంక్షలకు మద్దతు ఇస్తామని, గాజాలో సంఘర్షణానంతర పాలన, భద్రతకు పాలస్తీనియన్లు కేంద్రంగా ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు. మానవతా సహాయం సరఫరా, పాలస్తీనా ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసే ప్రయత్నాలతో సహా పాలస్తీనా జీవన నాణ్యతను మెరుగుపరచడానికి మంత్రులు తమ మద్దతును తెలియజేశారు.
31 మే 2024న అమెరికా అధ్యక్షుడు నిర్దేశించిన ప్రమాణాలు, UN భద్రతా మండలి తీర్మానం 2735 ప్రకారం.. తక్షణ కాల్పుల విరమణను సాధించడానికి, ఖైదీల విడుదలకు అనుగుణంగా కలిసి పని చేస్తామని మంత్రులు తెలిపారు. దౌత్య మార్గంలో పురోగతి సాధించే ప్రయత్నాలను దెబ్బతీసే చర్యలను పార్టీలు మానుకోవాలని మంత్రులు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!