కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఫై కేసు నమోదుకు కోర్టు ఆదేశం
- September 29, 2024
న్యూ ఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామను బెంగళూరు చట్టసభ ప్రతినిధుల కోర్టు షాకిచ్చింది. ఆమెపై కేసు నమోదు చేయాలని తిలక్నగర్ పోలీసులను ఆదేశించింది.బీజేపీని నిధుల కొరకు ఆమె పలువురు బడా వ్యాపారవేత్తలను బెదిరించి.. వారి నుంచి భారీ మొత్తంలో నగదును ఎలక్టోరల్ బాండ్ల పేరిట బీజేపీ పార్టీ అకౌంట్ కు బదిలీ చేశారని జనాధికార సంఘర్ష పరిషత్తుకు చెందిన ఆదర్శ్ అయ్యర్ ఆరోపణలు చేస్తూ గతంలో తిలక్‌నగర ఠాణాలో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు.
అతను ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేరు. నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదు చేసేందుకు నిరాకరించారు. పోలీసులు తాను ఇచ్చిన ఫిర్యాదు తీసుకోకపోవడంతో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై నిన్న విచారణ పూర్తి చేసిన న్యాయమూర్తి సంతోశ్ గజానన హెగ్డే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించి, తదుపరి విచారణను అక్టోబరు 10కి వాయిదా వేశారు. కాగా కోర్టు ఆదేశాలతోనైనా పోలీసులు నిర్మలా సీతారామన్ పై కేసు నమోదు చేస్తారో లేదో వేచి చూడాలి.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!