సౌదీ అరేబియాలో 11894 మందిపై బహిష్కరణ వేటు..!!
- September 29, 2024
రియాద్: గత వారంలో సౌదీ అరేబియా అంతటా తనిఖీలలో 15,324 మంది అక్రమ నివాసితులను అరెస్టు చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వారిలో 11894 మందిని బహిష్కరించినట్టు తెలిపింది. సెప్టెంబరు 19 - 25 మధ్య కాలంలో భద్రతా బలగాలు, సంబంధిత ప్రభుత్వ సంస్థలు నిర్వహించిన ఉమ్మడి క్షేత్ర భద్రతా తనిఖీలు నిర్వహించాయి. అరెస్టయిన వారిలో 9235 మంది రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించినవారు, 3772 మంది సరిహద్దు భద్రతా చట్టాన్ని ఉల్లంఘించినవారు, 2317 మంది కార్మిక చట్టాన్ని ఉల్లంఘించినవారు ఉన్నారని అధికారులు తెలిపారు. అదే విధంగా సరిహద్దులు దాటేందుకు ప్రయత్నిస్తూ 1226 అరెస్ట్ కాగా, వీరిలో 48 శాతం మంది యెమెన్ జాతీయులు, 51 శాతం ఇథియోపియన్ జాతీయులు, ఒక శాతం ఇతర దేశాలకు ఉన్నారు. ఎవరైనా వ్యక్తులు రాజ్యంలోకి అక్రమంగా ప్రవేశించడాన్ని సహాయం లేదా సేవలను అందించిన గరిష్టంగా 15 సంవత్సరాల జైలు శిక్ష, SR1 మిలియన్ వరకు జరిమానా విధించబడుతుందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. మక్కా, రియాద్, తూర్పు ప్రావిన్స్‌లోని ప్రాంతాలలో 911 నంబర్‌కు.. మిగిలిన ప్రాంతాలలో 999 మరియు 996 నంబర్లకు కాల్ చేయడం ద్వారా ఏదైనా ఉల్లంఘన కేసులను నివేదించాలని మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..