అజ్మాన్లో అక్టోబర్ నుండి కొత్త టాక్సీ ఛార్జీలు..!!
- September 30, 2024
యూఏఈ: అక్టోబర్లో టాక్సీ ఛార్జీ అజ్మాన్లోని ప్రతి కిలోమీటరుకు Dh1.75గా నిర్ణయించారు. ఈ మేరకు ఎమిరేట్స్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ Xలో ప్రకటించింది. ఇది సెప్టెంబర్లో ప్రతి కిమీకి Dh1.80 ధర ఉండగా.. తాజాగా 5 ఫిల్స్ తగ్గించారు. కిలోమీటరుకు ఛార్జీ తగ్గడం ఇది వరుసగా రెండో నెల కావడం గమనార్హం. అంతకుముందు, సెప్టెంబరులో ధర కిలోమీటరుకు ఆగస్టులో 1.83 దిర్హామ్ల నుండి 3 ఫిల్స్ తగ్గించారు. ఇంధన ధరలు తగ్గడంతో ట్యాక్సీ ఛార్జీలను ఆ మేరకు తగ్గించారు. కొత్త ధరలు అక్టోబర్ 1 నుండి అమలులోకి వస్తుందని అథారిటీ వెల్లడించింది. ఇదిలా ఉండగా, సెప్టెంబర్ ధరలతో పోలిస్తే యూఏఈలో ఇంధన ధరలు లీటరుకు 24 ఫిల్స్ చొప్పున తగ్గాయి.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!