బాలీవుడ్ సీనియర్ నటుడు ఇంట్లో గన్ మిస్ ఫైర్.. మోకాలికి తగిలిన బుల్లెట్
- October 01, 2024
బాలీవుడ్ సీనియర్ నటుడు, శివసేన నాయకుడు గోవిందా (Govinda) ఇంట్లో ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం (అక్టోబర్ 1) ఉదయం ప్రమాదవశాత్తూ ఇంట్లో గన్ మిస్ ఫైర్ అయి తన మోకాలికి బుల్లెట్ తగిలింది.
దీంతో హుటాహుటిన గోవిందను ముంబైలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే..
నటుడు గోవింద తన లైసెన్స్‌డ్ రివాల్వర్‌ను తీసుకెళ్తుండగా అది చేతి నుంచి జారి కిందపడింది. దీంతో తుపాకీ పేలి కాలిలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. వెంటనే వైద్యులు చికిత్స అందించి బుల్లెట్‌ను తొలగించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, కొన్ని రోజులు ఆసుపత్రిలో ఉంటారని గోవిందా మేనేజర్ తెలిపారు.
పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. నటుడు గోవిందా మంగళవారం తెల్లవారుజామున 4:45 గంటలకు ఆయన ఇంటి నుంచి కోల్‌కతాకు బయలుదేరే ముందు తన తుపాకీని తనిఖీ చేస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగిందని తెలిపారు.
తుపాకీ మిస్ ఫైర్ కావడంతో బుల్లెట్ తన మోకాలికి తగిలిందని.. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. కాగా తన వద్ద ఉన్న తుపాకీకి లైసెన్స్ ఉందని పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!