‘గేమ్ ఛేంజర్’.! ఇది కదా ఫ్యాన్స్‌కి కావల్సింది.!

- October 01, 2024 , by Maagulf
‘గేమ్ ఛేంజర్’.! ఇది కదా ఫ్యాన్స్‌కి కావల్సింది.!

ఊరించారు ఊరించారు.. చివరికి వదిలారు. మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ నుంచి జాతరలాంటి పాటను రిలీజ్ చేశారు. రెండు సార్లు ఈ సాంగ్ కోసం అప్డేట్ ఇచ్చి జస్ట్ పోస్టర్లు లేదంటే చిన్న క్లిప్స్ వదిలి నిరాశ పరిచారు.

కానీ, ఈ సారి సాంగ్ రిలీజ్ చేశారు. లిరికలే అయినా అక్కడక్కడా వదిలిన చరణ్ డాన్స్ మూమెంట్స్ ఫ్యాన్స్‌ని పిచ్చెక్కించేస్తున్నాయ్. అలాగే, శంకర్ మేకింగ్‌లో వస్తున్న ఈ పాట స్క్రీన్‌పై దద్దరిల్లిపోయేలా వుండబోతోందనీ మేకింగ్ ద్వారా చెప్పకనే చెప్పేశారు.

అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించిన ఈ పాటకు థమన్ మ్యూజిక్ అందించగా, గణేష్ ఆచార్య డాన్స్ కంపోజేషన్ ఇరగదీసేశాడు. ఈ పాట కోసం చాలా రకాల ట్రెడిషనల్స్ ని సిద్ధం చేస్తున్నారట.

ఉత్తరాంధ్రలో ఫేమస్ అయిన తప్పెట గుళ్లు తరహాలో రకరకాల సాంప్రదాయ నృత్యరీతుల్ని చూపించబోతున్నారట. పాటలో రామ్ చరణ్ మాత్రం చాలా ఫార్మల్‌గా కనిపిస్తున్నాడు.

‘కళ్లజోడు తీస్తే మీలాంటివాడినే, టక్కు టయ్యి తీస్తే మీలాంటి వాడినే..’ అంటూ హెలికాప్టర్ నుంచి క్యాజువల్‌గా దిగొచ్చేసి డాన్స్ చేసేస్తున్నాడు రామ్ చరణ్. కన్నుల పండుగలా వుంది చూసేందుకు ఈ పాట. జస్ట్ లిరికల్ సాంగే ఇలా వుంటే.. ఇక, ఫుల్ సాంగ్ ఏ రేంజ్‌లో వుండబోతోందో.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com