తిప్ప తీగతో ఇన్ని లాభాలా.? తెలిస్తే అస్సలు వదిలి పెట్టరు.!
- October 01, 2024
చూడ్డానికి కాస్త తమలపాకును పోలినట్లుండే తిప్ప తీగతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్. చాలా తేలిగ్గా పెరిగే ఈ తీగ జాతి మొక్కను ఇంట్లో సులువుగా పెంచుకోవచ్చు. రోజూ కొన్ని ఆకుల రసం తాగితే వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు.
కాలుష్య పూరితమైన నేటి ప్రపంచంలో తిప్ప తీగతో తెచ్చుకునే ఆరోగ్యం చాలా మెండు. ఇంతకీ తిప్ప తీగతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటీ.? ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా తరచూ జలుబు, దగ్గు, ఆస్మాతో బాధపడేవారికి తిప్ప తీగ రసం చాలా బాగా ఉపయోగపడుతుంది.
డయాబెటిస్ వున్నవారు కూడా తిప్ప తీగ రసం తాగొచ్చు. దానివల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులో వుంటాయ్.
మహిళల్లో అరుదుగా వచ్చే బోలు ఎముకల వ్యాధికి తిప్ప తీగ మంచి ఔషధం. ఆయుర్వేదంలో తిప్ప తీగను బాగా ఉపయోగిస్తారు.
అలాగే, శరీరంలోని ట్యాక్సిన్లను తొలగించడంలో తిప్ప తీగ రసం బాగా యూజ్ అవుతుంది. తిప్పతీగలోని ప్రీ రాడికల్స్ క్రిములతో పోరాడడం వల్ల సీజనల్గా వచ్చే వ్యాధుల నుంచి దూరంగా వుండొచ్చు.
వ్యాధి నిరోధక శక్తి పెంచడంలో తిప్ప తీగ పాత్ర అత్యంత కీలకం. ఇంకెందుకాలస్యం మీరూ ఓ తీగ తెచ్చి చక్కగా కుండీలో నాటుకుంటే సరి. చూసేందుకు పచ్చగా అందంగా అలుముకుంటుంది. అలాగే బోలెడంత ఔషధాల గని ఇంట్లోనే వున్నట్లూ అవుతుంది.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..