కార్నిష్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు.. వన్ సైడ్ రోడ్ మూసివేత..!!

- October 01, 2024 , by Maagulf
కార్నిష్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు.. వన్ సైడ్ రోడ్ మూసివేత..!!

దోహార్: కార్నిష్ నుండి రాస్ అబూ అబౌద్ ఎక్స్‌ప్రెస్‌వే వైపు వచ్చే వారి కోసం పబ్లిక్ వర్క్స్ అథారిటీ (అష్ఘల్) ట్రాఫిక్ అలెర్ట్ ను జారీ చేసింది.  ఒక దిశలో తాత్కాలిక రహదారిని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబరు 3 అర్ధరాత్రి నుండి అక్టోబరు 6 ఉదయం 6 గంటల వరకు అల్ రుఫా ఇంటర్‌సెక్షన్ నుండి రాస్ అబూ అబౌద్ వైపు ఒక దిశలో మూడు లేన్‌లు మూసివేయబడతాయని పేర్కొంది. రోడ్డు నిర్వహణ పనులు చేపట్టేందుకు ఈ మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మ్యాప్‌లో చూపిన ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని వాహనదారులకు సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com