బీమా పాలసీలకు కొత్త రూల్స్
- October 01, 2024
ముంబై: జీవిత బీమా ప్రీమియంలకు సంబంధించి అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. దీంతో బీమా ప్రీమియం పెరిగే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. లేదంటే ఏజెంట్ల కమీషన్‌లో కోత పడే సూచనలు కనిపిస్తున్నాయి. మెరుగైన సరెండర్ వాల్యూ అందించాలన్న బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏ ఆదేశాలు మంగళవారం నుంచి అమల్లోకి రానుండడం ఇందుకు నేపథ్యం. జీవిత బీమా తీసుకునే వారిలో కొందరు గడువు ముగియక ముందే తమ పాలసీ రద్దు చేసుకుంటారు. దీన్నే బీమా పరిభాషలో సరెండర్ అంటారు. అయితే, ఈ సరెండర్ విలువకు సంబంధించి బీమా నియంత్ర, అభివృద్ధి ప్రాధికార సంస్థ కొన్ని నెలల క్రితం సవరించిన మార్గదర్శకాలను జారీ చేసింది. పాలసీని సరెండర్ చేస్తే మెరుగైన విలువను ఇవ్వాలని పేర్కొంది. ఆ మొత్తం సహేతుకంగా, సొమ్ముకు తగిన ప్రతిఫలం ఉండాలని పేర్కొంది.ఐఆర్‌డీఏఐ ఆదేశాలు పాటించాలంటే అటు బీమా ప్రీమియం పెంచడం గానీ, ఏజెంట్లకు చెల్లించే కమీషన్‌ను తగ్గించడం బీమా కంపెనీల ముందు ఉన్న ఐచ్ఛికాలని ప్రైవేటు రంగ బీమా కంపెనీకి చెందిన సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఈ ఆదేశాల వల్ల కమీషన్ విధానంలో చాలా వరకు మార్పులు రాబోతన్నాయని కేర్ ఎడ్జ్ రేటింగ్స్ డైరెక్టర్ గౌరవ్ దీక్షిత్ పేర్కొన్నారు. ప్రీమియంలోనూ మార్పులు రాబోతున్నాయని చెప్పారు.
తాజా వార్తలు
- ఖతార్ అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం..!!
- సౌదీ సార్వభౌమత్వ రక్షణకు రాజీ పడబోము..!!
- యూఎన్- బహ్రెయిన్ భాగస్వామ్యం.. కీలక రంగాల్లో పురోగతి..!!
- సబ్సిడీ డీజిల్ చోరీ కేసుల్లో 21 ట్యాంకర్లు, ట్రక్కులు సీజ్..!!
- కువైట్లో భారతీయ నర్సు మృతి..!!
- యూఏఈ స్కూళ్లలో స్కాలర్షిప్లు.. 50 శాతం వరకు ఫీజు రాయితీ..!!
- ది హేగ్ ఎంబసీ ఫెస్టివల్లో ఒమన్ సాంస్కృతిక వైభవం..!!
- అక్టోబర్ 7 దాడుల కథనంపై స్పందించిన ఎమిరేట్స్..!!
- సౌదీలో 5 రోజులపాటు వర్షాలు.. ప్రజలకు హెచ్చరిక..!!
- యూకేలో టెక్నికల్ ప్రాబ్లమ్.. ఖతార్ ఎయిర్వేస్ విమానాలకు అంతరాయం..!!







