దళపతి 69 మూవీ లాంచ్..
- October 04, 2024
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ అభిమానులు ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. హెచ్ వినోద్ దర్శకత్వంలో నటించనున్న చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు చెన్నైలో జరిగాయి. విజయ్ కెరీర్‌లో 69 మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. తన సినీ కెరీర్‌లో విజయ్‌కు ఇదే చివరి చిత్రం అని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా.. పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్. ప్రేమలు ఫేం మమితా బైజు, ప్రకాశ్ రాజ్, ప్రియమణి, నరేన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, బాబీడియోల్ లు కీలక పాత్రలను పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
త్వరలోనే ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలు కానున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాని 2025 అక్టోబర్‌లో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే వెల్లడించింది.
ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ‘తమిళగ వెట్రి కళగం’ అనే పార్టీని విజయ్ స్థాపించారు. 2026లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనే తమ పార్టీ పోటీ చేస్తుందని, అంతక ముందు జరిగే ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయదని విజయ్ ఇప్పటికే వెల్లడించారు. ఇక పై సినిమాలు కూడా చేయనని ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!