ఆన్ లైన్ లో అటెస్టేషన్ సేవలు ప్రారంభం..ఇక 24గంటలు క్లియరెన్స్ సర్టిఫికేట్..!!
- October 07, 2024
దోహా: ఖతార్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన వెబ్‌సైట్ ద్వారా కొత్త ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్ అటెస్టేషన్ సేవలను ప్రారంభించింది. కొత్త సేవలు అంతర్గత మంత్రిత్వ శాఖ జారీ చేసిన పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్ ఎలక్ట్రానిక్ ధృవీకరణ, ప్రభుత్వ పాఠశాలలు జారీ చేసిన విద్యా ప్రమాణపత్రాలను అందిస్తాయి. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కాన్సులర్ వ్యవహారాల విభాగం డైరెక్టర్ HE మొహమ్మద్ అబ్దుల్లా అల్ సుబాయి మాట్లాడుతూ.. కొత్త సేవలు లబ్ధిదారులు కాన్సులర్ వ్యవహారాల శాఖ భవనంలోని ధృవీకరణ విభాగాన్ని సందర్శించాల్సిన అవసరం లేకుండా వెంటనే అవసరమైన పత్రాలను అందజేస్తుందన్నారు. ఈ సర్వీస్ 24 గంటలు అందుబాటులో ఉంటుందన్నారు. మరింత సమాచారం కోసం https://mofa.gov.qa/ వెబ్‌సైట్‌కి లాగిన్ కావాలని తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎయిర్వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!
- బీచ్‌లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!
- ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!
- ఇండియా-ఒమన్ ఆర్థిక భాగస్వామ్యం..షురా కౌన్సిల్ సమీక్ష..!!
- హైదరాబాద్‌లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్‌లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్







