ఏపీలో కొత్తగా ఐదు జిల్లాలు ఏర్పాటు అవాస్తవం
- October 07, 2024
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు అంశంపై మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. సామాజిక మాద్యమాల్లో రెండు రోజులుగా కొత్తగా జిల్లాలను ఏర్పాటు చేయడంతో పాటూ రెండు, మూడు జిల్లాలను రద్దు చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది.. కొత్త జిల్లాల ఏర్పాటు, ఉన్న జిల్లాల రద్దు అంశంపై స్పష్టతనిచ్చింది. ఈ మేరకు ఫ్యాక్ట్ చెక్ టీమ్ ట్వీట్ చేసింది.
రాష్ట్రంలో 26 జిల్లాలు కాస్త 30 జిల్లాలుగా ఏర్పాటు కాబోతున్నాయని.. కొన్ని మార్పులు, చేర్పులు జరగబోతున్నట్లు సామాజిక మాద్యమాల్లో ఓ డాక్యుమెంట్ వైరల్ అవుతోంది. కొత్తగా మరికొన్ని జిల్లాలను ఏర్పాటు చేయడంతో పాటుగా ప్రస్తుతం ఉన్న జిల్లాల్లో కూడా మార్పులు చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకటి, రెండు జిల్లాలను రద్దు చేయబోతున్నట్లు జోరుగా ఊహాగానాలు మొదలయ్యాయి.
నూతన జిల్లాల ఏర్పాటు, ప్రస్తుతం ఉన్న జిల్లాలను రద్దు చేస్తారనే ప్రచారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది. సామాన్యుడు ఇచ్చిన సలహాను ప్రభుత్వ నిర్ణయంగా ప్రకటిస్తూ, సమాజంలో అశాంతి రేపడానికి కొంత మంది అల్లరి మూకలు తప్పుడు ప్రచారం చేస్తున్నారనీ, అనకాపల్లి జిల్లా రద్దు చేస్తున్నారు అనేది పూర్తిగా అవాస్తవం అని తెలిపింది.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్