కెనడాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు...

- October 08, 2024 , by Maagulf
కెనడాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు...

టోరొంటో: కెనడాలోని టోరొంటో నగరంలో TACA ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
తెలుగు అలయెన్సెస్ ఆఫ్ కెనడా Telugu Alliances of Canada(TACA) ఆధ్వర్యంలో 05 అక్టోబరు 2024 శనివారం రోజున కెనడాదేశం గ్రేటర్ టోరొంటో లోని బ్రాంప్టన్ నగరం సాండల్ వుడ్ పార్క్వే సెకండరి స్కూల్ ఆడిటోరియంలో 1000 వేయి మందికి పైగా ప్రవాస తెలుగు వాసులు పాల్గొని బతుకమ్మ  సంబరాలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు.మహిళలు సాంప్ర దాయదుస్తులతో బతుకమ్మ ఆటలు ఆడుతు పాటలు పాడుకొన్నారు.  

ఉత్తమ బతుకమ్మ బహుమతిని గౌతమి కొండబత్తిని,మౌణిక మరం,సౌజన్య కొంపల్లి,దివ్య ఆడెపుమరియు మౌణిక కందకట్ల గారలు గెలుచుకొన్నారు.పండుగ మొదటి నుండి ఆఖరు వరకు ప్రముఖ గాయకురాలు పారిజాత లైవ్ బతుకమ్మ పాటలతో ప్రత్యేక ఆకర్శనగా ఎంతో ఉత్సాహంగా జరిగాయి.

ఈ సందర్భంగా TACA ఆధ్వర్యంలో మంచి రుచికరమైన భోజనాలు ఏర్పాటు చేసారు.ఈ పండుగ సంబురాలు TACA అధ్యక్షులు రమేశ్ మునుకుంట్ల ఆధ్వర్యంలో జరుగగా ఉపాధ్యక్షులు రాఘవ్ కుమార్ అల్లం, కార్యదర్శి ప్రసన్నకుమార్ తిరుచిరాపల్లి, సాంస్కృతిక కార్యదర్శి అనిత సజ్జ,కోషాధికారి మల్లిఖార్జునాచారి పదిర, సాంస్కృతిక సమన్వయకర్త సంతోష్ కొంపల్లి డైరక్టర్లు ప్రదీప్ కుమార్ రెడ్డి ఏలూరు, శ్రీదుర్గా ఆదిత్యవర్మ భూపతిరాజు, కుమారి విద్య భవణం, ఖజిల్మొహమ్మద్  యూత్ డైరక్టరు లిఖిత యార్లగడ్డ, యస్వంత్తేజ కర్రి,ఎక్స్ అఫిసియో సభ్యురాలు కల్పన మోటూరి, ఫౌండెషన్ కమీటీ చైర్మన్ అరుణ్ కుమార్ లాయం, ట్రస్టీబోర్డుచైర్మన్ సురేశ్ కూన, ట్రస్టీలు విద్యాసాగర్ రెడ్డి సారబుడ్ల, శృతి ఏలూరి,వాణి జయంతి మరియు ఫౌండర్లు హనుమంతాచారి సామంతపుడి, శ్రీనాథ్ కుందూరి, మునాఫ్ అబ్దుల్ గారలు పాల్గొన్నారు.          

బతుకమ్మలను ప్రక్కనేగల హంబర్ నదిలో నిమజ్జనం చేసిసాంప్రదాయ బద్దంగా తయారు చేసుకొని వచ్చినఫలహారాలను ఆరగించారు. మహిళలు గౌరమ్మ పసుపుకుంకుమలను పంచుకున్నారు.

ఆఖరుగా అధ్యక్షులు రమేశ్ మునుకుంట్ల బతుకమ్మ పండుగలో పాల్గొన్న తెలుగు వారందరికీ, వలంటీర్లకు మరియు ఈ దిగ్విజయములో సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియచేస్తూ వచ్చే నెల నవంబరు 2న జరిగే దీపావళి పండుగలో తెలుగు వారందరూ పాల్గొనవలసినదిగా కోరుతూ ఈ సంవత్సరముబతుకమ్మ పండుగ వేడుకలను ముగించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com