BD 640,000 డ్రగ్స్ రాకెట్ బస్ట్.. నెట్‌వర్క్‌ విచ్ఛిన్నానికి యత్నాలు..!!

- October 08, 2024 , by Maagulf
BD 640,000 డ్రగ్స్ రాకెట్ బస్ట్.. నెట్‌వర్క్‌ విచ్ఛిన్నానికి యత్నాలు..!!

మనామా: BD 640,000 (సుమారు $1.7 మిలియన్ USD) విలువైన క్యాప్‌టాగన్ షిప్‌మెంట్‌ను విజయవంతంగా అడ్డుకున్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది.  దాదాపు 130,000 క్యాప్టాగన్ మాత్రలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. ఈ కేసుకు సంబంధించి నిందితులు దేశం బయట ఉన్నారని, వారిని రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.  డ్రగ్స్‌ను గుర్తించకుండా ప్రత్యేక వర్క్‌షాప్‌లలో తయారు చేసిన గట్టిగా మూసివేసిన పైపుల రవాణాలో తెలివిగా దాచిపెట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి, స్మగ్లింగ్ ఆపరేషన్‌లో ప్రమేయం ఉన్న 38 ఏళ్ల మహిళను ఇప్పటికే అరెస్టు చేశారు. విచారణ కొనసాగుతుందని, ఈ స్మగ్లింగ్ ఆపరేషన్‌లో ఉన్న విస్తృత నెట్‌వర్క్‌ను విచ్ఛిన్నం చేయడానికి తీవ్రంగా కృషి చేస్తున్నట్టు బహ్రెయిన్ అధికారులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com