గోరు చిక్కుడుతో ప్రెగ్నెంట్ లేడీస్‌కి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా.?

- October 09, 2024 , by Maagulf
గోరు చిక్కుడుతో ప్రెగ్నెంట్ లేడీస్‌కి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా.?

గోరు చిక్కుడుతో ప్రెగ్నెంట్ లేడీస్‌కి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా.?
గోరు చిక్కుడు చాలా మందికి ఇష్టముండదు. కానీ, గోరు చిక్కుడుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు.
ముఖ్యంగా ఆస్తమా వున్నవారు గోరు చిక్కుడు తప్పని సరిగా తినాలని చెబుతున్నారు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు రాకుండా వుండేందుకు గోరు చిక్కుడు బాగా యూజ్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
అంతేకాదు, దీనిలో విటమిన్ సితో పాటూ, ఫైబర్ అలాగే వాటర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువే.అందుకే గోరు చిక్కుడు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.
ఫైబర్ కంటెంట్ అధికంగా వుండడం వల్ల జీర్ణ వ్యవస్థ బాగుపడుతుంది. మలబద్ధకం సమస్యలు దరి చేరవ్. ఒకవేళ వున్నా ఉపశమనం వుంటుంది.
ఇక, ప్రెగ్నెంట్ లేడీస్ విషయంలో గోరు చిక్కుడు వరంలాంటిది. ప్రెగ్నెంట్ లేడీస్ ట్యాబ్లెట్ల  రూపంలో ఫోలిక్ యాసిడ్ తీసుకుంటుంటారు.
కానీ, గోరుచిక్కుడులో సహజ సిద్ధంగానే పోలెట్ లభిస్తుంది. ఇది పిండం ఆరోగ్యంగా అభివృద్ధి చెందడంలో తోడ్పడుతుంది. అలాగే ఐరెన్ డెఫిషియన్సీ వున్నవారికీ కూడా గోరు చిక్కుడు మంచి ఫలితాల్నిస్తుంది.
రక్త హీనతను తగ్గించడంతో పాటూ, బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగించడంలోనూ తోడ్పడుతుంది. గోరు చిక్కుడులోని ఫైటో కెమికల్స్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలోనూ తోడ్పడతాయ్.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com