Dh400 ఫైన్.. జైవాకింగ్ చేసిన 37 మందికి జరిమానా..!!

- October 14, 2024 , by Maagulf
Dh400 ఫైన్.. జైవాకింగ్ చేసిన 37 మందికి జరిమానా..!!

దుబాయ్: నైఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జైవాకింగ్ చేసిన 37 మందికి జరిమానాలు విధించారు. ప్రమాదకరంగా క్రాస్ చేయడం, ట్రాఫిక్ సిగ్నల్లను విస్మరించడం, ఇతరులకు ప్రమాదం కలిగించినందుకు జరిమానాలు విధించినట్టు అధికారులు తెలిపారు.ఫెడరల్ ట్రాఫిక్ చట్టంలోని ఆర్టికల్ 89 ప్రకారం.. పాదచారుల ట్రాఫిక్ సిగ్నల్లను ఉల్లంఘించడం లేదా అనధికార ప్రాంతాలలో క్రాసింగ్ చేస్తే Dh400 జరిమానా విధించబడుతుంది. ఇదిలా ఉండగా జైవాకింగ్ ఎలా ప్రాణాంతక పరిణామాలకు దారితీస్తుందో దుబాయ్ పోలీసులు చాలాసార్లు హైలైట్ చేశారు. నిర్దేశించని ప్రదేశాల నుండి ప్రజలు రోడ్లు దాటుతుండగా గతేడాది జరిగిన రన్ ఓవర్ ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి చెందగా, 339 మంది గాయపడ్డారు. 2023లో జైవాకింగ్ చేసినందుకు దాదాపు 44,000 మంది పాదచారులకు జరిమానా విధించారు. నైఫ్ పోలీస్ స్టేషన్ డిప్యూటీ డైరెక్టర్ బ్రిగేడియర్ ఒమర్ మౌసా అషౌర్ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం గురించి పాదచారులను గట్టిగా హెచ్చరించారు. క్రాసింగ్ గైడ్లైన్స్ను పాటించాలని, రోడ్డు దాటడానికి ముందు ట్రాఫిక్ ను గమనించాలని సూచించారు. పాదచారులు క్రాసింగ్ మార్గదర్శకాలను పాటించాలని, రోడ్డుపై వాహనాలు లేకుండా చూసుకోవాలని ఆయన కోరారు. పాదచారుల కదలికల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాహనదారులకు పిలుపునిచ్చారు.  నిర్ణీత క్రాసింగ్ల వద్ద పాదచారుల క్రాసింగ్ కు ప్రాధాన్యత ఇవ్వడంలో వాహన డ్రైవర్లు విఫలమైతే Dh500 జరిమానా, ఆరు బ్లాక్ పాయింట్లతో శిక్షార్హమైనదని హెచ్చరించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com