ISRO కు ప్రతిష్టాత్మక ఐఏఎఫ్‌ అవార్డు

- October 14, 2024 , by Maagulf
ISRO కు ప్రతిష్టాత్మక ఐఏఎఫ్‌ అవార్డు

సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో)కు ప్రతిష్ఠాత్మకమైన ఐఏఎఫ్‌ అవార్డు దక్కింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుండి చంద్రయాన్‌- 3 రాకెట్‌ ప్రయోగించి ఘన విజయం సాధించి అగ్రదేశాల సరసన భారత దేశాన్ని నిలిపినందుకు ఐఏఎఫ్‌ సంస్థ ప్రతిష్టాత్మక అవార్డును ఇస్రోకు అందజేశారు.

ఈ ఏడాది ఈ అవార్డు కార్యక్రమాన్ని ఐఏసి-2024 ఇటలీలోని మిలన్‌ నగరం నందు నిర్వహించారు.ఈ అవార్డును ఇస్రో తరపున చైర్మన్‌ డాక్టర్‌ సోమనాథ్‌ అందుకున్నారు.

శాస్త్రవేత్తలు, ఉద్యోగుల సహకారంతో చంద్రయాన్‌-3 ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టడం జరిగిందన్నారు.ఈ అవార్డును అందుకున్నందుకు ఇస్రో శాస్త్రవేత్తలు, ఇస్రో ఉద్యోగస్తులకు ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ సోమనాధ్‌ అభినందనలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com