సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆ ప్రాంతాల వారికి హెచ్చరికలు జారీ..!!

- October 15, 2024 , by Maagulf
సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆ ప్రాంతాల వారికి హెచ్చరికలు జారీ..!!

రియాద్: సౌదీ అరేబియాలో రాగల మూడు నాలుగు రోజుల వరకు మక్కాతోపాటు మరికొన్ని ఇతర ప్రాంతాలలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు,నివాసితులు అప్రమత్తంగా ఉండాలని సివిల్ డిఫెన్స్ జనరల్ డైరెక్టరేట్ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా మక్కా ప్రాంతంలో ఆకస్మిక వరదలు, వడగళ్ళు, బలమైన గాలులతో పాటు మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తైఫ్, మైసన్, అధమ్ , అల్-అర్దియత్, తురాబాలో ఉండే వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అలాగే అల్-బహా, అసిర్, జజాన్, నజ్రాన్ ప్రాంతాలలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని, తూర్పు ప్రావిన్స్‌లో తేలికపాటి జల్లులు పడవచ్చని అంచనా. రియాద్ ప్రాంతంలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. వాడి అల్-దవాసిర్, అల్-సులాయిల్, అల్-అఫ్లాజ్, హవ్తా బనీ తమీమ్ , అల్-ఖర్జ్‌లకు తేలికపాటి నుండి మోస్తరు వర్ష సూచన ఉందని పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, లోయలకు దూరంగా ఉండాలని, వరద ప్రాంతాలలో ఈతకు దూరంగా ఉండాలని సివిల్ డిఫెన్స్ కోరింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com