BLS కేంద్రాలలో పాస్‌పోర్ట్ కొరియర్ డెలివరీ తప్పనిసరి కాదు..ఇండియన్ ఎంబసీ
- October 15, 2024
కువైట్: సర్వీస్డ్ డాక్యుమెంట్లు/పాస్‌పోర్ట్‌ను ఇచ్చిన చిరునామాలో డెలివరీ చేయాలని కోరుకునే వారికి ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్లలో (BLS ఇంటర్నేషనల్) కొరియర్ సర్వీస్ పూర్తిగా ఐచ్ఛికం అని భారత రాయబార కార్యాలయం తెలియజేసింది. కొరియర్ సదుపాయం తప్పనిసరి కాదని, మీరు కొరియర్ సేవను ఎంచుకోకపోతే సర్వీస్డ్ డాక్యుమెంట్ లేదా పాస్‌పోర్ట్ పొందడంలో జాప్యం ఉండదని తెలిపింది. కొరియర్ డెలివరీ ఆప్షన్ ఎంచుకోకపోతే ఎంబసీ కేంద్రం నుండి పాస్‌పోర్ట్‌ను ఒకటి లేదా రెండు రోజుల ముందుగానే తీసుకోవచ్చని తెలిపింది. BLS ఇంటర్నేషనల్.. కువైట్ నగరం, ఫహాహీల్, జ్లీబ్ అల్-షువైఖ్, జహ్రాలోని కేంద్రాలలో పాస్‌పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలను అందజేస్తుంది. సపోర్టింగ్ డాక్యుమెంట్లతో అప్లికేషన్లు, సర్వీస్డ్ డాక్యుమెంట్లు/పాస్‌పోర్ట్‌ల డెలివరీ కాకుండా, ఎంబసీ నిర్ణయించిన ప్రతి సేవకు ఛార్జీలతో కొన్ని అదనపు సేవలను అందించడానికి ఎంబసీ ద్వారా BLS ఒప్పందం చేసుకుంది. దరఖాస్తుదారులు తప్పనిసరిగా BLS ఇచ్చిన రసీదులో ఐచ్ఛిక సేవలకు సంబంధించిన ఛార్జీలను చెక్ చేసుకోవాలని ఎంబసీ సూచించింది. మరింత సమాచారం కోసం హెల్ప్‌లైన్ నంబర్: +965 6550 1767కు లేదా [email protected]కి ఇమెయిల్ చేయవచ్చని తెలిపింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి