మెగా మేనల్లుడి బర్త్ డే గిఫ్ట్ చూశారా?

- October 16, 2024 , by Maagulf
మెగా మేనల్లుడి బర్త్ డే గిఫ్ట్ చూశారా?

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (సాయి దుర్గ తేజ్‌గా ఈ మధ్య పేరు మార్చుకున్నాడు. తన తల్లి దుర్గ పేరును తన పేరులో యాడ్ చేసుకున్నాడు). కొత్త సినిమా ప్రకటించాడు. SDT18 వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమాకి రోహిత్ అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ విషయాన్ని తెలుపుతూ చిత్ర బృందం ఓ మేకింగ్ వీడియోని విడుదల చేశారు. ఈ రోజు సాయి దుర్గా తేజ్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఆయన కొత్త ప్రాజెక్ట్‌ని అనౌన్స్ చేసింది.
కాగా, ఈ సినిమాకి ‘హనుమాన్’తో సెన్సేషనల్ విజయం అందుకున్న నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ‘ధైర్యాన్నే కవచంగా, ఆశనే ఆయుధంగా చేసుకున్న వ్యక్తి అందరి కోసం నిలబడతాడు.. ఇది కేవలం ప్రారంభం మాత్రమే..’ అనే క్యాప్షన్‌తో ఈ మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు.
వీడియోలో సాయి దుర్గా తేజ్ కండలు తిరిగిన దేహంతో పవర్ ఫుల్ లుక్స్‌తో డిఫరెంట్ మేకోవర్‌తో కనిపిస్తున్నాడు. ‘విరూపాక్ష’, ‘బ్రో’ సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న తేజ్ ఈ సినిమాతో ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తాడో చూడాలి మరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com