సౌదీ అరేబియాలో స్థిరంగా ద్రవ్యోల్బణం.. సెప్టెంబర్ లో 1.7 శాతం..!!
- October 16, 2024
రియాద్: సౌదీ అరేబియా వినియోగదారుల ధరల సూచిక (CPI) లేదా ద్రవ్యోల్బణం రేటు సెప్టెంబర్ 2023తో పోలిస్తే 2024 సెప్టెంబర్‌లో 1.7 శాతం వద్ద స్థిరంగా ఉంది. ఏడాది పొడవునా స్థిరత్వాన్ని కొనసాగిస్తోందని జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ (GASTAT) నెలవారీ నివేదికలో వెల్లడించారు. సెప్టెంబర్ 2023తో పోల్చితే 2024 సెప్టెంబర్‌లో అద్దె ధరలు ప్రధాన ద్రవ్యోల్బణానికి కారణమైనట్టు పేర్కొన్నారు. హౌసింగ్, నీరు, విద్యుత్, గ్యాస్, ఇతర ఇంధనాల ధరలు 9.3 శాతం, ఆహారం, పానీయాల ధరలు 0.8 శాతం పెరిగాయని.. రవాణా ధరలు 3.3 శాతం తగ్గాయని తెలిపారు. సెప్టెంబర్ 2024లో హౌసింగ్ అద్దెలు 11.2 శాతం పెరిగాయి. అపార్ట్మెంట్ అద్దె ధరలు 10 శాతం పెరిగాయి. కూరగాయల ధరలలో 5.2 శాతం పెరుగుదల నమోదైంది. క్యాటరింగ్ సర్వీస్ ధరలు 1.5 శాతం పెరగడంతో రెస్టారెంట్లు, హోటళ్ల రంగంలో ధరలు కూడా 1.7 శాతం పెరిగాయి. ఇంటర్మీడియట్, మాధ్యమిక విద్య ఫీజులు 3.8 శాతం పెరగడం వల్ల విద్యా రంగం 1.6 శాతం పెరుగుదల నమోదైంది. మరోవైపు ఫర్నిషింగ్ మరియు గృహోపకరణాల ధరలు 3.7 శాతం తగ్గాయి. ఫర్నీచర్, కార్పెట్లు, ఫ్లోరింగ్ ధరలు 7 శాతం క్షీణించాయి. దుస్తులు, పాదరక్షల ధరలు 3.2 శాతం తగ్గాయి. రెడీమేడ్ దుస్తుల ధరలలో 5.5 శాతం, రవాణా రంగంలో 3.3 శాతం తగ్గుదల నమోదుకాగా, వాహనాల కొనుగోలు ధరల్లో 4.5 శాతం తగ్గిందని నివేదికలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి