నవంబర్‌లో బిగ్ బ్యాడ్ వోల్ఫ్ బ్యాక్.. పుస్తకాలపై 75% వరకు తగ్గింపు..!!
- October 18, 2024
దుబాయ్: ప్రపంచంలోనే అతిపెద్ద పుస్తక ప్రదర్శన బిగ్ బ్యాడ్ వోల్ఫ్ ఆరవ ఎడిషన్ నవంబర్ 29 నుండి డిసెంబర్ 9 వరకు దుబాయ్ స్టూడియో సిటీలోని సౌండ్ స్టేజ్లలో నిర్వహించబడుతుంది. ప్రవేశం ఉచితం. విస్తృత శ్రేణి పుస్తకాలపై 75 శాతం వరకు తగ్గింపుతో రానుంది. దుబాయ్ స్టూడియో సిటీలోని సౌండ్ స్టేజ్లలో బెస్ట్ సెల్లర్లు, జీవిత చరిత్రలు, గ్రాఫిక్ నవలలు, పిల్లల పుస్తకాలు, క్లాసిక్లు, సైన్స్ ఫిక్షన్, కళలు, చేతిపనులు, చరిత్ర, వ్యాపార పుస్తకాలు, అనేక అరబిక్ పుస్తకాలు, వంటల పుస్తకాలతో సహా రెండు మిలియన్లకు పైగా పుస్తకాలు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. 2009లో ప్రారంభమైనప్పటి నుండి బిగ్ బ్యాడ్ వోల్ఫ్ బుక్స్ ఫిలిప్పీన్స్, కంబోడియా, హాంకాంగ్, ఇండోనేషియా, మయన్మార్, పాకిస్తాన్, సింగపూర్, తైవాన్, యూఏఈ, మలేషియా, శ్రీలంక, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్ సహా 15 దేశాలలో 37 నగరాలలో ప్రదర్శనలు నిర్వహించినట్టు బిగ్ బాడ్ వోల్ఫ్ వ్యవస్థాపకుడు ఆండ్రూ యాప్ తెలిపారు. షేఖా లతీఫా బింట్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ నేతృత్వంలోని దుబాయ్ కల్చర్ అండ్ ఆర్ట్స్ అథారిటీ (దుబాయ్ కల్చర్) ఈ ఈవెంట్‌కు మద్దతు ఇస్తుందన్నారు.
తాజా వార్తలు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స