అయోధ్య: దీపోత్సవానికి ముస్తాబు.. పుష్ఫ వర్షానికి ఏర్పాట్లు

- October 21, 2024 , by Maagulf
అయోధ్య: దీపోత్సవానికి ముస్తాబు.. పుష్ఫ వర్షానికి ఏర్పాట్లు

అయోధ్య: యూపీలోని రామనగరి అయోధ్య దీపోత్సవానికి ముస్తాబవుతోంది. తాజాగా అవధ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తన బృందంతో కలిసి రామ్ కీ పైడీ, దీపోత్సవ్ సైట్‌లను పరిశీలించారు.

అక్టోబరు 22న అయోధ్యలో దీపోత్సవం జరగనుంది. దీనికిముందు అవధ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రతిభా గోయల్, ఆమె బృందం రామ్ కీ పైడీ వద్ద వేద పండితుల సమక్షంలో భూమి పూజ చేయనున్నారు. నూతన రామాలయంలో బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్టించిన తర్వాత జరిగే మొదటి దీపాల పండుగ ఇదే కావడంతో, దీనిని అద్భుతంగా నిర్వహించాలని రామాలయ ట్రస్టు భావిస్తోంది.

ఈసారి అయోధ్యలో 25 లక్షల దీపాలు వెలిగించి, నూతన రికార్డు సృష్టించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 40 స్వచ్ఛంద సంస్థలతో పాటు అవధ్ యూనివర్సిటీ, కాలేజీ, 36 ఇంటర్ కాలేజీలకు చెందిన 30 వేల మందికి పైగా విద్యార్థులు దీపాలు వెలిగించనున్నారు. రామ్‌ కీ పైడీ సహా 55 ఘాట్‌లపై 28 లక్షల దీపాలు వెలిగించనున్నారు. ఇందుకోసం దాదాపు 90 వేల లీటర్ల నూనెను వినియోగించనున్నారు. అక్టోబర్ 28 నాటికి ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తికానున్నాయి. ఈ ఏడాది దీపోత్సవం నిర్వహిస్తున్న సమయాన హెలికాప్టర్ల నుంచి పూలవర్షం కురిపించనున్నారు. అలాగే అయోధ్య నగరాన్ని పూలతో అందంగా అలంకరించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com